Viral News: పెళ్లైన వారం రోజులకే భర్తకు నవ వధువు షాక్.. షాపింగ్ చేద్దామని బయటకు వచ్చి ప్రియుడితో జంప్

కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని మోని కుమారి నమ్మబలికింది. దీంతో బీకాపూర్ సంతోషి మాత గాలిలో నివసించే వివేక్ కుమార్‌కు నౌవాగర్హి నివాసి మోని కుమారితో జూన్ 14 న వివాహం జరిపించారు.

Viral News: పెళ్లైన వారం రోజులకే భర్తకు నవ వధువు షాక్.. షాపింగ్ చేద్దామని బయటకు వచ్చి ప్రియుడితో జంప్
Bihar News
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2022 | 2:41 PM

Viral News: బీహార్‌లోని (Bihar) ముంగేర్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తాళికట్టిన వాడు కళ్లముందే ఉండగానే.. మరో యువకుడితో పారిపోయింది కొత్త పెళ్లి కూతురు. పెళ్లయిన వారం రోజుల తర్వాత పెళ్లికూతురు తన భర్తతో కలిసి గాజులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లి ప్రియుడితో కలిసి పారిపోయింది. నవ వధువు ప్రేమికుడితో కలిసి స్కార్పియో కారులో భర్త ముందే పారిపోయింది. అయితే కొత్వాలి పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వివాహితను పట్టుకున్నారు. ప్రేమికుడు దివ్యాంశుని అరెస్ట్ చేశారు. మార్కెట్‌లో ప్రేమికుడితో కలిసి పారిపోయిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో బయటపడింది.

కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని మోని కుమారి నమ్మబలికింది. దీంతో బీకాపూర్ సంతోషి మాత గాలిలో నివసించే వివేక్ కుమార్‌కు నౌవాగర్హి నివాసి మోని కుమారితో జూన్ 14 న వివాహం జరిపించారు. జూన్ 18 న అతని భార్య తన తల్లి ఇంటికి వెళ్లిందని వివేక్ చెప్పాడు. జూన్ 21న తిరిగి వచ్చి జూన్ 22 సాయంత్రం వివేక్ కుమార్‌తో కలిసి గాజులు కొనడానికి మార్కెట్‌కి వెళ్లింది. దీనదయాళ్ చౌక్ దగ్గరమోని కుమారి.. భర్త వివేక్ కుమార్‌ చేయి విడిపించుకుని మరో యువకుడి చేయి పట్టుకుని కారులో కూర్చొని వెళ్లిపోయింది. ఈ విషయమై వివేక్ తల్లి కంచన్ దేవి కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కొత్వాలీ పోలీస్ స్టేషన్ వెంటనే రంగంలోకి దిగారు.. బరౌని స్టేషన్ నుండి కొత్తగా పెళ్లయిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ప్రేమికుడు దివ్యాంశు నివాసి కాంతాపూర్ నౌవాగర్హిని అరెస్టు చేశారు. తాము చదువుకునే సమయంలో దగ్గరయ్యామని.. 2016 నుంచి ప్రేమించుకుంటున్నామని, 2020 సెప్టెంబర్ 5న చండికా స్థాన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నామని ప్రేమికుడు-ప్రేయసి తెలిపారు. అయితే  దివ్యాంశు కుటుంబం తమ పెళ్లిని ఇష్టపడలేదని చెప్పారు. దీంతో వారం రోజుల క్రితం మోనికి వివేక్ కుమార్ తో వివాహమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!