AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూల్‌లో బూట్లతో కొట్టుకున్న టీచర్స్.. సీన్ చూసి విస్తుపోయిన స్టూడెంట్స్.. ఏం జరిగిందంటే..

Viral Video: పాఠశాలకు లేట్ వచ్చిందనే కారణంలో ఉపాధ్యాయురాలిపై చెప్పులతో దాడి చేశాడు స్కూల్ ప్రిన్సిపల్. అడ్డుకున్న వారిని పక్కను నెట్టిమరీ కొట్టాడు.

Viral Video: స్కూల్‌లో బూట్లతో కొట్టుకున్న టీచర్స్.. సీన్ చూసి విస్తుపోయిన స్టూడెంట్స్.. ఏం జరిగిందంటే..
Teachers
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2022 | 2:05 PM

Share

Viral Video: పాఠశాలకు లేట్ వచ్చిందనే కారణంలో ఉపాధ్యాయురాలిపై చెప్పులతో దాడి చేశాడు స్కూల్ ప్రిన్సిపల్. అడ్డుకున్న వారిని పక్కను నెట్టిమరీ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండా.. అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ లఖీంపూర్‌ ఖేరీలోని మహేంగు ఖేరా గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఇదే స్కూల్‌లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. స్కూల్‌కు లేట్‌గా ఎందుకు వచ్చారంటూ ఆమెను నిలదీశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ప్రిన్సిపల్ మరింత రెచ్చిపోయాడు. కాలి షూ తీసి ఉపాధ్యాయురాలిని కొట్టాడు. అతని దాడికి షాక్ అయిన ఉపాధ్యాయురాలి.. ఆ తరువాత తాను కూడా కాలి చెప్పుతో ప్రిన్సిపల్‌ను కొట్టింది. ఈ ఘర్షణ పాఠశాలలో ఇతర ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ ఎదుటే చోటు చేసుకోగా.. కొందరు ఈ గొడవను వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. ఘర్షణపై వివరణ ఇచ్చాడు ప్రిన్సిపల్ అజిత్ వర్మ. ఉపాధ్యాయురాలు రోజూ ఆలస్యంగా వస్తుందని, కొన్నిసార్లు సంతకం చేసి వెళ్లిపోతుందని ఆరోపించాడు. ఇదే విషయంపై ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలేదన్నాడు. కాగా, ఈ ఘర్షణపై ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?