భారత్‏కు మణిహారంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. చివరి దశలో వంతెన.. ఎక్కడుందంటే..

ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రైల్వే బ్రిడ్జి 88 శాతం నిర్మాణ పనులు పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

భారత్‏కు మణిహారంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. చివరి దశలో వంతెన.. ఎక్కడుందంటే..
Chenab Rail Bridge
Rajitha Chanti

|

Jun 25, 2022 | 1:42 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన..  పారిస్‏లోని ఈఫిల్ టవర్ ఎత్తు కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రైల్వే బ్రిడ్జి  త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ వంతెన మరెక్కడో కాదండి.. మన భారతదేశంలోని చీనాబ్ నదిపై (Chenab rail bridge)  నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రైల్వే బ్రిడ్జి 88 శాతం నిర్మాణ పనులు పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో చీనాబ్ రైలు వంతెన ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వంతెన కశ్మీర్ కు అన్ని వాతావరణ రైలు కనెక్టివిటీని తీసుకువస్తుందంటూ  రైల్వే బ్రిడ్జి ఫోటోలను షేర్ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఇది.. దాదాపు రూ. 28,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్‌లో భాగం. ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. నాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన ఎత్తు 359 మీటర్లు. అంటే పారిస్‏లోని ఈఫిల్ టవర్ ఎత్తు కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గంటకు 266 కిమీ వేగంతో కూడిన గాలి వేగాన్ని తట్టుకునేలా దీనిని నిర్మిస్తున్నారు.. ఇది భారతదేశంలో మొదటిసారిగా DRDOతో సంప్రదించి బ్లాస్ట్ లోడ్ కోసం రూపొందించబడింది. ఒక పీర్/ట్రెస్ట్ ను తొలగించిన తర్వాత కూడా ఈ వంతెన గంటకు 30 కి.మీటర్ల వేగంతో నిర్ణీత వేగంతో పనిచేస్తుందని రైల్వే తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది భారతదేశంలో అత్యధిక తీవ్రత జోన్-v భూకంప బలాలను కూడా భరిస్తుంది. ఈ వంతెన నిర్మాణ కాంట్రాక్టును ఆఫ్కాన్స్ సంస్థకు అప్పగించారు. దీని నిర్మాణంలో కొంకణ్ రైల్వే, DRDO కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్వ ద్వారా కేవలం 20-22 గంటల్లోనే కాశ్మీర్ సరుకులు ఢిల్లీకి చేరుకుంటాయి. దీంతో సరుకుల రవాణా ఖర్చు తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. అలాగే కాశ్మీరీ సరుకులు చౌకగా లభిస్తాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu