Maharashtra: శివసేనను అంతం చేయాలని చూస్తున్నారు.. బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ సెన్సేషనల్ కామెంట్స్

మహారాష్ట్రలో(Maharashtra) ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. శివసేనను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు....

Maharashtra: శివసేనను అంతం చేయాలని చూస్తున్నారు.. బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ సెన్సేషనల్ కామెంట్స్
Uddav
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 25, 2022 | 11:49 AM

మహారాష్ట్రలో(Maharashtra) ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. శివసేనను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. శివసేన(Shivasena) కార్యకర్తలే తమ సంపద అన్న ఉద్ధవ్ వారు తనతో ఉన్నంత వరకూ తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. పార్టీ నేతల కృషి, కష్టం వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అసంతృప్తికి గురవుతున్నారని శిండే వర్గాన్ని విమర్శించారు. మహా వికాస్‌ అఘాడీ కూటమి పక్షాల్లో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని ఏక్‌నాథ్‌ శిండేకు గతంలో చెప్పానని ఉద్ధవ్‌(CM Uddav) గుర్తు చేసుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై కేసులు ఉన్నాయన్న ఉద్ధవ్.. ఇప్పుడు వారంతా బీజేపీలో వెళితే శుద్ధి అయిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వారంతా మాతో ఉంటే జైలుకు వెళతారని ఎద్దేవా చేశారు. శివసేన కార్యకర్తలు తనను అసమర్థుడిగా భావిస్తే తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు.

బీజేపీ హిందుత్వ ఓట్లను ఇంకెవరితోనూ పంచుకోవాలనుకోవట్లేదు. అందుకే శివసేను అంతం చేయాలని చూస్తోంది. హిందుత్వ ఓట్లు చీలొద్దన్న ఉద్దేశంతోనే బాల్‌ ఠాక్రే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీతో కలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎంతో కాలం నిలబడదు. వీలైతే శివసేన ఓటర్లను తీసుకెళ్లండి.

      – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర సర్కార్‌కు రాజకీయ సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే సూరత్‌ నుంచి గౌహతి చేరుకున్నారు. తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన తర్వాత, ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హోటల్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం షిండేతో పాటు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి గౌహతికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలంతా బస చేసిన హోటల్‌కు హైలెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.