Bengal Tiger: వణికిస్తున్న పెద్దపులి సంచారం.. మొదటిసారిగా పులిని చూసి సొమ్మసిల్లిన గ్రామస్థుడు.. కట్ చేస్తే

కాకినాడ(Kakinada) జిల్లాలో నెలరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అధికారులను(Tiger Wandering) ముప్పుతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా, చిక్కకుండా తిరుగుతోంది. కాగా.. ఇప్పటివరకు సీసీ కెమెరాలకే పరిమితమైన పులిని ఓ వ్యక్తి చూశాడు. రౌతులపూడి మండలం యస్.పైడపాల గ్రామంలో పట్టపగలే సంచరిస్తున్న పులిని చూసి అవాక్కయ్యాడు. అప్పలనాయుడు అనే వ్యక్తి.. ఉదయం 9.30గంటల సమయంలో గేదెలను తోలుకుని సమీపంలోని గెడ్డకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి నీళ్లు తాగేందుకు పెద్దపులి రావడంతో హడలిపోయాడు. వెంటనే అప్రమత్తమై […]

Bengal Tiger: వణికిస్తున్న పెద్దపులి సంచారం.. మొదటిసారిగా పులిని చూసి సొమ్మసిల్లిన గ్రామస్థుడు.. కట్ చేస్తే
Tiger
Follow us

|

Updated on: Jun 25, 2022 | 11:18 AM

కాకినాడ(Kakinada) జిల్లాలో నెలరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అధికారులను(Tiger Wandering) ముప్పుతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా, చిక్కకుండా తిరుగుతోంది. కాగా.. ఇప్పటివరకు సీసీ కెమెరాలకే పరిమితమైన పులిని ఓ వ్యక్తి చూశాడు. రౌతులపూడి మండలం యస్.పైడపాల గ్రామంలో పట్టపగలే సంచరిస్తున్న పులిని చూసి అవాక్కయ్యాడు. అప్పలనాయుడు అనే వ్యక్తి.. ఉదయం 9.30గంటల సమయంలో గేదెలను తోలుకుని సమీపంలోని గెడ్డకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి నీళ్లు తాగేందుకు పెద్దపులి రావడంతో హడలిపోయాడు. వెంటనే అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అడవికి చేరుకున్న అధికారులు పులి అడుగు జాడలు ఉన్నట్లు గుర్తించారు. కాగా పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నామని, పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక పాండవులపాలెం, శరభవరం గ్రామాల మధ్య సరుగుడు తోటలు, దట్టమైన చెట్లతో ఉండే మెట్టల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కాకినాడ(Kakinada) జిల్లా ప్రత్తిపాడులో పులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే అధికారులకు చిక్కినట్టే చిక్కి చివరి నిమిషంలో దిమ్మదిరిగే షాకిచ్చింది పులి. దాదాపు రెండు వారాలుగా పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా పులి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాలో(CC camera) రికార్డయ్యాయి. పులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు.

జూన్‌ 4వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులి శరభవరంలో ఏర్పాటు చేసిన బోను వద్దకు వచ్చింది. ఒక్క అడుగు ముందుకు వేస్తే పులి బోనులో చిక్కేది. కానీ అనూహ్యంగా పులి అక్కడ్నుంచి వెనుదిరిగింది. ఇదంతా సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డైంది. పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవులపాలెం, పోతులూరు ప్రాంతాల్లో ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే ఉంటూ వేటాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..