AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!

నా కుమార్తె కనిపించడం లేదు.. ఎనిమిది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. బ్రతికే ఉందా.. లేదా.. చెప్పాలంటూ ఆ తండ్రి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆవేదన చెందుతున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది.

నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!
Andhra News
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 1:40 PM

Share

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని ఇరవై రెండు వార్డు యాదవుల బజార్ కు చెందిన కామనబోయిన చంద్ర శ్రీను పశువుల కొనుగోలు మధ్యవర్తిత్వం చేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు పిల్లులున్నారు. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకూ చదివి ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల నాలుగో తేదిన చౌడేశ్వరి రాత్రి ఏడు గంటల సయమంలో ఇంటిలో నుండి వెళ్లిపోయింది. దీంతో చంద్రశ్రీను అందరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వాకబు చేశాడు. ఎవరూ కూడా తమ ఇంటికి రాలేదని చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాచర్ల పట్టణ పోలీసులు ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీంతో చంద్ర శ్రీను తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.

కన్న కూతురు కనిపించక వారం రోజులు దాటి పోయింది. అసలు ఉందో లేదో అన్న అనుమానం పీడిస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ బిడ్డ ఆచూకీ ఎమైనా లభించిందా అని ఆరా తీశాడు. పోలీసుల నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయ్నం చేయబోయాడు. వెంటనే బంధువులు అతన్ని నిలువరించి ఒంటిపై నీళ్లు పోశారు. వారం రోజుల క్రితం తన కూతురు వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చంద్ర శ్రీను వాపోయాడు.

అయితే చౌడేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నామంటున్నారు. మేజర్ కావడంతో ఆమె ఎక్కడికి వెళ్లిందో అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ప్రేమ వ్యవహారమా లేదా ఇతర కారణలేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే చౌడేశ్వరి ఆచూకీ కనుగొంటామని పోలీసులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్?
RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్?
ఇరాక్‌ షిప్‌ బ్లాస్ట్‌ ఘటనలో భారతీయుడి మృతి..!
ఇరాక్‌ షిప్‌ బ్లాస్ట్‌ ఘటనలో భారతీయుడి మృతి..!
మహాలక్ష్మీ రాజయోగం .. ఈ రాశుల వారు కోట్లు కొల్లగొట్టడం ఖాయం!
మహాలక్ష్మీ రాజయోగం .. ఈ రాశుల వారు కోట్లు కొల్లగొట్టడం ఖాయం!
టెన్త్ విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. 30 ని ఆలస్యమైనా ఓకే!
టెన్త్ విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. 30 ని ఆలస్యమైనా ఓకే!
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పీఎస్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పీఎస్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే
మండుతున్న ఎండల వేళ.. కాస్త ఊరటనిచ్చే వార్త..
మండుతున్న ఎండల వేళ.. కాస్త ఊరటనిచ్చే వార్త..
జుట్టు రాలడం ఆగాలంటే.. వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి?
జుట్టు రాలడం ఆగాలంటే.. వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి?
శ్రీనగర్‌లో ముందే వసంతం.. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్..
శ్రీనగర్‌లో ముందే వసంతం.. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్..
అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు హాలీవుడ్‌లో కూడా రాణించాలి
అల్లు అర్జున్ పాన్ ఇండియానే కాదు హాలీవుడ్‌లో కూడా రాణించాలి
300 కాదు భయ్యో, అంతకుమించి.. బౌలర్లకు బడితపూజే ఇక..!
300 కాదు భయ్యో, అంతకుమించి.. బౌలర్లకు బడితపూజే ఇక..!