Watch Video: అలా చేత్తో నెడితేనే పడిపోతోంది.. యూపీలో ప్రభుత్వ నిర్మాణాలపై అఖిలేష్ ఆగ్రహం.. వీడియో వైరల్
ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రాణిగంజ్ (Raniganj) నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనులను సమాజ్‌వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ (RK Verma) గురువారం పరిశీలించారు.
Brick Wall Collapses With UP MLA’s Push: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం నాసిరకంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై ప్రతిపక్షపార్టీ సమాజ్ వాదీ ఆగ్రహం వ్యక్తంచేసింది. యూపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కళాశాల భవనంలో నాణ్యత లేదని, చేతితో నెడితేనే పడిపోతుందంటూ సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు అఖిలేష్ వీడియోను షేర్ చేశారు. రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రాణిగంజ్ (Raniganj) నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనులను సమాజ్‌వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ (RK Verma) గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవలం చేత్తో నెడితేనే కూలిపోతున్న ఆ నిర్మాణాలకు సంబంధించిన వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఇది నాలుగు అంతస్తుల ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ భవనం అంటూ వర్మ పేర్కొన్నారు. ‘‘ఇటువంటి నాసిరకం పనులతో ప్రభుత్వం.. యువత భవిష్యత్తును నిర్మించడం లేదు.. పైగా వారి మరణానికి ఏర్పాట్లు చేస్తోంది. రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో అవినీతి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది’’ అంటూ వర్మ విమర్శించారు. దీనిపై విచారణ జరిపించాలని స్థానిక ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు.
కాగా.. ఈ వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం శుక్రవారం ట్విటర్ వేదికగా పంచుకున్నారు. బీజేపీ పాలనలో అవినీతి అద్భుతం. సిమెంట్ లేకుండానే కళాశాల నిర్మాణంలో ఇటుకలు పేర్చారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పనుల్లో నాణ్యతాలేమిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదిలాఉంటే.. సంబంధిత అధికారులు నిర్మాణ సామగ్రి నమూనాలు సేకరించి, తనిఖీలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
भाजपा के राज में, घोर भ्रष्टाचार का कमाल है निराला बिन सीमेंट, इंजीनियर कॉलेज की ईंटों को जोड़ डाला pic.twitter.com/q2iqFyCELX
— Akhilesh Yadav (@yadavakhilesh) June 24, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..