Tihar Jail: తిహార్ జైలులో ఖైదీ అత్మహత్య.. ఫ్యాస్ కు ఉరేసుకుని ఘటన

తీహార్ జైలులో(Tihar Jail) ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. 19 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ సీలింగ్ ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బదౌన్ జిల్లాకు...

Tihar Jail: తిహార్ జైలులో ఖైదీ అత్మహత్య.. ఫ్యాస్ కు ఉరేసుకుని ఘటన
Tihar Jail
Ganesh Mudavath

|

Jun 25, 2022 | 11:19 AM

తీహార్ జైలులో(Tihar Jail) ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. 19 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ సీలింగ్ ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బదౌన్ జిల్లాకు చెందిన బ్రహ్మ్ నంద్ అలియాస్ వికాస్ కిడ్నాప్, రేప్‌తో కేసుల్లో పోక్సో చట్టంతో ఫిబ్రవరి 4 నుంచి జైలులో ఉన్నట్లు సీనియర్ జైలు అధికారులు వెల్లడించారు. వికాస్ జైలులోని మొదటి అంతస్తులో అండర్ ట్రయల్ ఖైదీల రికార్డ్ రూమ్‌లో సేవదార్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే రికార్డు గదికి వచ్చిన వికాస్.. మధ్యాహ్నం 2.50 గంటలకు తన గది తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఖైదీలు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే వికాస్ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వికాస్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదే ఏడాది జనవరిలో తిహార్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనం రేకెత్తించింది. పుదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరుచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ ఐదుగురిని జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఓ ఖైదీని దీన్​దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu