Crime: షర్టు విప్పితే గుట్టు వీడింది.. స్టన్ అయిన పోలీసులు.. గంజాయి, డ్రగ్స్ కాదండోయ్..
ఆంధ్ర టు చెన్నై..కోట్లకు కోట్ల డబ్బులు..గంజాయి అనుకొని దాడి చేస్తే..కట్టలకు కట్టల నగదు దొరికింది. ఇంత పెద్ద మొత్తంలో మనీ పట్టుబడటం సంచలనంగా మారింది.
గంజాయి ముఠాను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు పోలీసులు. కానీ కట్టలకు కట్టల నగదు దొరికింది. అవును..చెన్నై(Chennai)లో భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకేరోజు రెండు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. ఐతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రా(Andhra Pradesh) నుంచే చెన్నైకు తరలుతోంది ఈ హవాలా మనీ(hawala). చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర భారీగా నగదు పట్టుబడింది. షర్ట్ లోపల సుమారు 30లక్షలు..బ్యాగ్‌లో మరో 30 లక్షలు గుర్తించారు రైల్వే పోలీసులు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు..అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతను రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్నాడని..కానీ విజయవాడ(Vijayawada) నుంచి చెన్నైకి టికెట్ తీసుకున్నట్టు గుర్తించారు. రైళ్లలో హవాలా మనీ, గంజాయి, మద్యం స్మగ్లర్లను పట్టుకునేందుకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని..ఇందులో భాగంగా చేపట్టిన సోదాల్లోనే భారీగా నగదు పట్టుబడిందని..మనీని సీజ్ చేసి వారిని విచారిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ఆ మనీని ఎక్కడికి తరలిస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో పడ్డారు.
మరో చోట 2 కోట్లు…
ఇంకో ఘటనలో ఏపీ నుంచి గంజాయి రవాణా అవుతుందన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. చెన్నై శివారు మనడి దగ్గర సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఒంగోలు నుంచి వచ్చిన కారులో రెండు కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఐటీ శాఖకు సమాచారం అందించారు. ఏపీకి చెందిన ఇద్దరిని ఐటీ అధికారులకు అప్పగించారు.