AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Election Voting: మీ దగ్గర ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయొచ్చు.. నో టెన్షన్.. ఈ 12 పత్రాల్లో ఒక్కటి ఉన్నా చాలు..

ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఓటు హక్కు వినియోగించుకోలేమనే అపోహ చాలమందిలో ఉంది. ఓటర్ గుర్తింపు ధృవవీకరణ పత్రం లేకపోయినా మీరు ఓటు వేయవచ్చు. మీరు ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం 12 రకాల ఫోటో గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం గుర్తించింది.

AP Municipal Election Voting: మీ దగ్గర ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయొచ్చు.. నో టెన్షన్.. ఈ 12 పత్రాల్లో ఒక్కటి ఉన్నా చాలు..
Voter Id
Venkatrao Lella
|

Updated on: Nov 01, 2026 | 8:46 AM

Share

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ జరుగుతోండగా.. ప్రజలు ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. మొత్తం 99.36 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా.. 10,262 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా వేటు వేసే వీలుంది. ఇందుకోసం 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం గుర్తించింది. వీటిల్లో ఏదైనా ఒక కార్డు తీసుకెళ్లి ఓటు వేయవచ్చు. చాలామంది తమ వద్ద ఓటర్ ఐడీ కార్డు లేదని, ఓటు వేయడానికి అనుమతిస్తారో లేదోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న సందేహాలను పోగొట్టడానికి ఎన్నికల అధికారులు స్పష్టతనిచ్చారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా.. ప్రభుత్వం జారీ చేసిన ఫోటోతో కూడిన ఇతర గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ 12 రకాల కార్డులు చెల్లుతాయి

-పాస్‌పోర్ట్: అంతర్జాతీయ ప్రయాణాల కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది

-డ్రైవింగ్ లైసెన్స్: ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఓటు వేయవచ్చు

-ఆధార్ కార్డ్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే కీలకమైన ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం చెల్లుబాటు అవుతుంది

-మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్: ఫోటోతో కూడిన ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ ఓటర్ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది

-ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్: కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్ కూడా చెల్లుతుంది

-పాన్ కార్డ్: ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కార్డు ఇది. ఇది కూడా చెల్లుతుంది

-ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఐడీ కార్డులు: కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలఉద్యోగులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల గుర్తింపు కార్డులు

-బ్యాంకు/పోస్టాఫీస్ పాస్‌బుక్: ఫోటోతో కూడిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్ కూడా చెల్లుబాటు అవుతుంది

-రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) జారీ చేసిన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ స్మార్ట్ కార్డ్ ఉపయోగించుకోవచ్చు

-ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్: ఫోటో కలిగిన పెన్షన్ పత్రాలు

-ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు: పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల అధికారిక గుర్తింపు కార్డులు

-రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు

Follow Us
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ