నా మనసు హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా.. టాలీవుడ్ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
31 October 2026
టాలీవుడ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటన, అందంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్, తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
త్వరలో విడుదల కానున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.
హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, "నా కెరీర్‌కు పునాది వేసింది హైదరాబాద్ నగరం. ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను.
నా హృదయం ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటుంది. త్వరలోనే సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు రాబోతున్నాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చింది రకుల్.
రణ్‌బీర్ కపూర్ హీరోగా, నితీష్ తివారి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణలో రకుల్ శూర్పణఖ పాత్రలో కనిపించనుంది.
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ధ్రువ, నాన్నకు ప్రేమతో వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.
తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను అలరించిన రకుల్, మళ్లీ తెలుగు తెరపై కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రకుల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.