అందాలతో మెంటలెక్కిస్తున్న అనుపమ.. పిక్స్ అదరహో

31-10-2026

Pic credit - Instagram

Phani Ch

‘మెంటల్ మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా పేతురాజ్ తన అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలతో నటిగా తన ప్రతిభను చాటుకుంది. అలాగే అల వైకుంఠపురములోలో కీలక పాత్ర పోషించి మెప్పించింది.

బ్లడీ మేరీలో టైటిల్ రోల్, దాస్ కా ధమ్కీలో నటనతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ZEE5లో విడుదలైన ‘పరువు’ వెబ్ సిరీస్‌లో ఆమె నటనకు మంచి స్పందన లభించింది.

కేవలం నటనలోనే కాకుండా, ప్రొఫెషనల్ కార్ రేసింగ్‌లో కూడా తన ప్రతిభను చూపించిన నివేదా, మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఓ దశలో సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని కూడా నిర్ణయించుకున్నారట.

కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన నివేదా.. ఏకంగా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని అనుకున్నానని తాజాగా వెల్లడించారు.

అయితే తాజాగా ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టి త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం’లో సెకండ్‌ లీడ్‌గా నటించింది.