బేకరీలో పనిచేస్తున్న యువతిపై కత్తి దాడి.. చికిత్స పొందుతూ మృతి!
ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెంలో యువతిపై జరిగిన కత్తి దాడి విషాదాంతంగా మారింది. యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్న.. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. జంగారెడ్డిగూడెంలోని ఓ బేకరీలో స్వప్న మరో యువతితో కలిసి పనిచేస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో స్వప్న తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న స్వప్న చివరకు ప్రాణాలు కోల్పోయింది. తనపై దాడి చేసిన వ్యక్తి రామకృష్ణ అని బాధితురాలు పోలీసులకు తెలిపింది. నిందితుడు ఏలూరు జిల్లా పోలవరం మండలం తంగేడుకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అయితే ఈ దాడికి అసలు కారణం ఏమిటి? నిందితుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. స్వప్న మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, దాడికి దారితీసిన పరిస్థితులను ఆరా తీస్తున్నారు. పరారీ ఉన్న నిందితుడికి కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..