తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న శ్రీనిధి శెట్టి 

31 October 2026

Rajeev 

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది.

యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమాతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది.

 కేజీఎఫ్ 2 తో శ్రీనిధి శెట్టి క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో రీనా పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. 

2025లో నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 హిట్ 3’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో డాక్టర్ రాగా కుమార్ పాత్రలో కనిపించింది.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.