AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajan P Dev: ఈ టాలీవుడ్ విలన్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం చివరి రోజుల్లో కెమెరాను కూడా చూడలేకపోయారు

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి వందల సినిమాల్లో నటించారు రాజన్ పి. దేవ్. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో తనదైన విలనిజంతో ఆడియెన్స్ ను మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు రాజన్ పి. దేవ్

Rajan P Dev: ఈ టాలీవుడ్ విలన్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం చివరి రోజుల్లో కెమెరాను కూడా చూడలేకపోయారు
Rajan P Dev
Basha Shek
|

Updated on: Oct 31, 2026 | 8:03 PM

Share

తెలుగు సినిమాల్లో తనదైన విలనిజంతో మెప్పించిన నటుల్లో రాజన్ పి దేవ్ ఒకరు. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు.. కానీ.. పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. రంగస్థలం నటుడిగా వెయ్యికిపైగా నాటకాల్లో నటించిన ఆయన మొదట కొన్ని మలయాళం సినిమాల్లో నటించారు. 1984, 86 సంవత్సరాలో కేరళ రాష్ట్రం ఉత్తమ నాటకరంగ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు రాజన్.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో విలన్ గానూ ఆకట్టుకున్నారు. 1954 లో కేరళలోని చేర్తల అనే గ్రామంలో ఎస్. జె. దేవ్, కుట్టియమ్మ దంపతులకు జన్మించారు రాజన్. తండ్రి రంగస్థల నటుడు కావడంతో రాజన్ కూడా అదే దారిలో ప్రయాణం ప్రారంభించాడు. సీనియర్ నాటకరంగ నిపుణుడైన ఎన్. ఎన్. పిళ్ళై సంస్థలో చేరి పలు నాటకాల్లో నటించాడు. ఇదే క్రమంలో 1984, 86 సంవత్సరాలో కేరళ రాష్ట్రం ఉత్తమ నాటకరంగ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు రాజన్. ఇదే క్రమంలో సినిమాల్లోకి కూడా అడుగు పెట్టారు. వెండితెరపై రాణిస్తున్నా రంగస్థలాన్ని వదిలిపెట్టలేదు రాజన్. ఓవైపు సినిమాలు చేస్తూనే జుబిలీ థియేటర్స్ అనే నాటక సంస్థను నెలకొల్పి దాని ద్వారా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1983 లో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన ఎంటే మమట్టికుట్టియమ్మక్కు అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రాజన్. ఆ తర్వాత కూడ పలు మలయాళం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో ఇతర భాషల్లోనూ అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేశారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాజన్. దిల్, ఆర్య, ఖుషి, ఆది, నాగ ఆయుధం, ఒక్కడు, సింహాద్రి, సీతయ్య, ప్రాణం, కొడుకు, అర్జున్, గుడుంబా శంకర్, బాలు, బన్నీ, వీరభద్ర, యోగి, విజయ దశమి, కాళిదాసు తదితర సినిమాలు రాజన్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఓవరాల్ గా 30 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కలిపి సుమారు సుమారు 500కు పైగా సినిమాల్లో నటించారు రాజన్.

కాగా వెండితెరపై రాజన్ ను చూస్తే చాలా పెద్ద మనిషిలా, పెద్ద వయస్కుడిలా కనిపిస్తారు. అయితే ఆయన చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. రాజన్ పి. దేవ్ మధుమేహంతో పాటు లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. ఈ వ్యాధుల కారణంగా ఆయన చాలాసార్లు ఆస్పత్రి పాలయ్యారు. మధుమేహం కారణంగా ఆయన కంటి చూపు కూడా కోల్పోయారు. సినిమా షూటింగ్ ల సమయంలో కెమెరాను చూడలేక ఇబ్బంది పడ్డారు. ఇక 2009 జూలై 26న కేరళలోని అంగమాలిలోని తన ఇంట్లో రక్తపు వాంతులు చేసుకోవడంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన జూలై 29న మరణించారు. అప్పుడు రాజన్ వయసు కేవలం 58 ఏళ్లు మాత్రమే. చివరిగా అజ్మల్ దర్శకత్వం వహించిన రింగ్‌టోన్ అనే సినిమాలో కనిపించారు రాజన్.

ఇవి కూడా చదవండి

రాజన్ కు భార్య శాంత, కుమార్తె అశమ్మ, కుమారుడు జుబిల్ రాజ్ ఉన్నారు. కుమారుడు జుబిల్ కూడా నటుడే. కొన్ని సినిమాల్లో ఆయన నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us