ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి తలపెట్టిన ‘ఓట్ బచావ్.. దేశ్ బచావో’ నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మందికి పైగా పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. 14 భద్రతా జోన్లు, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ర్యాలీ కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు.

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’ (INDIA) కూటమి తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ భారీ సభకు వచ్చే జనసమూహాన్ని, శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఓట్ బచావ్.. దేశ్ బచావో పేరుతో ఇండియా కూటమి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. ఛలో ఢిల్లీకి 10 లక్షల మంది వస్తారని అంచనా వచేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇండియా కూటమి మూడు డిమాండ్లు ఉంచింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేయడంతోపాటు.. 2023 ఎన్నికల కమిషన్ చట్టం రద్దు చేయాలని.. SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని పేర్కొంటోంది.న తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికల నిర్వహణకు డిమాండ్ చేస్తోంది.
భారీగా పోలీసు బలగాల మోహరింపు:
సభా వేదిక వద్ద, మార్గమధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4,000 మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) కంపెనీలను రంగంలోకి దించారు. రద్దీని నియంత్రించేందుకు రామ్‌లీలా మైదాన్‌ను మొత్తం 14 భద్రతా జోన్‌లుగా విభజించారు. ప్రతి జోన్‌ను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మైదాన్ చుట్టూ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో 200కి పైగా సీసీటీవీ (CCTV) కెమెరాలు, డ్రోన్‌లు, బాడీ-వార్న్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
ప్రయాణికులకు ట్రాఫిక్ ఆంక్షలు:
ఈ భారీ ప్రదర్శన కారణంగా ఢిల్లీలోని పలు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చే వారు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
