AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB ALP Admit Card 2026: RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) CBT-1 పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నవంబర్ 3 నుంచి 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలో 75 ప్రశ్నలు ఉండగా, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది..

RRB ALP Admit Card 2026: RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
RRB ALP Admit Card
Srilakshmi C
|

Updated on: Nov 01, 2026 | 7:01 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 1: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. RRB ALP CBT-1 పరీక్షలు నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలను తమ అడ్మిట్ కార్డులో పరిశీలించుకోవాలి. పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.

పరీక్ష విధానం

  • అసిస్టెంట్ లోకో పైలట్ CBT-1 పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు.
  • పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు
  • మొత్తం ప్రశ్నలు: 75
  • ప్రతి ప్రశ్నకు నిర్ణీత మార్కులు ఉంటాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • CBT-1లో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశ అయిన CBT-2కు ఎంపిక చేస్తారు.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా సంబంధిత ప్రాంతీయ RRB అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
  • ALP CBT-1 Admit Card 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
  • అందులోని వివరాలను పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • పరీక్ష కోసం హాల్‌టికెట్ ప్రింట్ తీసుకోవాలి.
  • అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి
నవంబర్ 1 రాశిఫలాలు: అదృష్టం కలిసొచ్చే రాశులివే..! వారు జాగ్రత్త
నవంబర్ 1 రాశిఫలాలు: అదృష్టం కలిసొచ్చే రాశులివే..! వారు జాగ్రత్త