AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating Apps: అకౌంట్‌లో నుంచి రూ. 6 కోట్లు మాయం.. కారణమేంటని బ్యాంక్ సిబ్బందిని అడగగా.. కస్టమర్‌కు మైండ్ బ్లాంక్..

Dating Apps: ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌తో ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నా జనాలు మాత్రం మారడం లేదు. కంటికి కనిపించని వారి మాయలో పడి మోసపోతున్నారు. అన్ని తెలిసిన వారు కూడా ఇలాంటి ఊబిలో ఇరుక్కుంటున్నారు. తాజాగా...

Dating Apps: అకౌంట్‌లో నుంచి రూ. 6 కోట్లు మాయం.. కారణమేంటని బ్యాంక్ సిబ్బందిని అడగగా.. కస్టమర్‌కు మైండ్ బ్లాంక్..
Narender Vaitla
|

Updated on: Jun 25, 2022 | 7:33 AM

Share

Dating Apps: ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌తో ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నా జనాలు మాత్రం మారడం లేదు. కంటికి కనిపించని వారి మాయలో పడి మోసపోతున్నారు. అన్ని తెలిసిన వారు కూడా ఇలాంటి ఊబిలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఏకంగా ఓ బ్యాంక్‌ మేనేజర్‌ డేటింగ్‌ యాప్‌ వలలో ఇరుక్కొని ఖాతాదారులు డబ్బులను కాజేశాడు. అంతా ఇంతా కాదు ఏకంగా రూ. 6 కోట్లు గోల్‌మాల్‌ చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచనలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన హరి శంకర్‌ హనుమంత నగర్‌ ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అతనికి ఓ డేటింగ్‌ యాప్‌లో యువతి పరిచయం అయ్యింది. కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య వీడియో కాల్స్‌ కూడా నడిచాయి. అనంతరం ఆ యువతి తనకు చాలా అత్యవసరంగా డబ్బులు కావాలని అడిగింది దీంతో రూ. 12 లక్షలు యువతి ఖాతాలో వేశాడు. మళ్లీ డబ్బులు కావాలని కోరడంతో ఏం చేయాలో తోచని హరి శంకర్‌ ఓ కన్నింగ్ ప్లాన్‌ వేశాడు. బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా రూ. 6 కోట్లు రుణాన్ని తీసి యువతి ఖాతాలో వేశాడు. అయితే అనిత అంతకుముందు తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్ చేసుకుంది. తాజాగా లోన్‌ కావాలని బ్యాంకులో అవసరమైన డ్యాక్యుమెంట్స్‌ ఇచ్చింది.

అయితే హరిశంకర్‌ ఆ డ్యాక్యుమెంట్లను తనకు అనుగుణంగా మార్చుకొని వాటితో రూ. 6 కోట్లు మంజూరు చేశాడు. సదరు మొత్తాన్ని డేటింగ్‌ యాప్‌లో పరిచయం అయిన యువతికి దోచి పెట్టాడు. పశ్చిమ బెంగాల్‌లోని పలు బ్యాంకులకు చెందిన 28 ఖాతాలకు, కర్ణాటకలోని రెండు ఖాతాలకు 136 లావాదేవీల్లో డబ్బు చేరినట్లు తేలింది. అనితకు అనుమానం రావడంతో బ్యాంకు అధికారులను ఆరా తీయగా హరిశంకర్‌ బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజ‌ర్ హ‌రిశంకర్‌తో పాటు అత‌నికి స‌హాకరించిన అసోసియేట్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కౌసల్య జెరాయ్, క్లర్క్ మునిరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..