India Corona Cases: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. నేడు రికార్డ్ స్థాయిలో నమోదైన పాజిటివ్ కేసులు..
India Covid 19 Updates: దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా
India Covid 19 Updates: దేశంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 15,940 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో వైరస్ కారణంగా 20 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,974కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12,425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సేఫ్ అయిన వారి సంఖ్య 4,27,61,481 లకు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 91,779 గా ఉంది. రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది.
రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు.. కాగా, రోజు రోజు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పదిరోజుల క్రితం వరకు వెయ్యి, రెండు వేలు మధ్యలో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. రోజు రోజుకు నమోదవుతున్న కేసుల మధ్య అంతరం భారీగా ఉంటోంది. శుక్రవారం నాడు 88,284 యాక్టీవ్ కేసులు ఉంటే.. నేడు అది 91,779కి పెరిగింది. అంటే నిన్నటికి ఇవాళ్టికి 3,495 కేసులు పెరుగుదల నమోదు అయ్యింది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో యాక్టీవ్ కేసులు 0.21 శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక రోజువారీ పాజిటివ్ రేటు 4.39 శాతంగా ఉంది.
#COVID19 | India reports 15,940 fresh cases and 20 deaths in the last 24 hours.
Active cases 91,779 Daily positivity rate 4.39% pic.twitter.com/EjMC4GKIZv
— ANI (@ANI) June 25, 2022