Viral Video: స్మార్ట్ వాచ్‌తో ఫాస్టాగ్ డబ్బులను కాజేస్తున్న బుడ్డోడు.. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో నిజమేంతంటే..
Fact Check: టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంతో హైవేలపై ప్రయాణం మరింత తేలికగా మారింది. ఫాస్టాగ్ బార్ కోడ్ సహాయంతో టోల్ చెల్లింపులు సులభతరంగా మారాయి...
Viral Video: టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ఫాస్టాగ్ (Fastag) విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంతో హైవేలపై ప్రయాణం మరింత తేలికగా మారింది. ఫాస్టాగ్ బార్ కోడ్ సహాయంతో టోల్ చెల్లింపులు సులభతరంగా మారాయి. దీంతో క్యూలో వేచి ఉండే పని కూడా తప్పింది. ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫాస్టాగ్ భద్రతపై ఇటీవల కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫాస్టాగ్ సెఫ్టీని ప్రశ్నార్థకంగా మార్చే ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో దీనిపై ఫాస్టాగ్ అధికారికంగా స్పందించాల్సి వచ్చింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే రోడ్డుపై కార్లు ఆగిన సమయంలో కార్ల అద్దాలను తూడుస్తూ కొందరు డబ్బులు అడుక్కుంటారనే విషయం తెలిసిందే. ఓ కుర్రాడు చేతుకి స్మార్ట్ వాచ్ ధరించి కారు ఫ్రంట్ అద్దాన్ని తూడుస్తున్నాడు. ఈ సమయంలోనే అద్దంపై ఉన్న ఫాస్టాగ్ బార్‌కోడ్‌పై రుద్దుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో సదరు స్మార్ట్ వాచ్ సహాయంతో ఫాస్టాగ్‌లోని డబ్బులను కాజేస్తున్నాడు అంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఫాస్టాగ్‌లో ఉన్న డబ్బునంతా స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి కాజేస్తున్నట్లు వార్త వైరల్ అయ్యింది.
@FASTag_NETC there is a video currently in circulation on scams involving scanning of fast tag and siphoning payments, is this true can you confirm? #cybersecurityawareness #cybersecurity pic.twitter.com/1L1uEDasT3
— Venkat Madala (@venky4a) June 18, 2022
అయితే ఈ విషయమై ఫాస్టాగ్ అధికారికంగా స్పందించింది. నెట్టింట జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘ఫాస్టాగ్ లావాదేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చెంట్స్ (టోల్, పార్కింగ్ ప్లాజా)కోసం మాత్రమే కేటాయించినవి. అనధికారిక డివైజ్‌లు ఏవీ ఫాస్టాగ్ బార్ కోడ్ ను స్కాన్ చేయలేవు. కాబట్టి ఫాస్టాగ్ ముమ్మాటికీ సురక్షితం’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఫాస్టాగ్ భద్రతపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది.
1/2> The Loot party new mode of loot. Be aware of this. Watch both part carefully how Apple wrist watch used for @FASTag_NETC scanning. Any remedy Mr @nitin_gadkari @OfficeOfNG @NHAI_Official kuch samajh aya foreign technology me se?? pic.twitter.com/ggkNHJCr0b
— Sergeant Bikash?? (@Bikash63) June 24, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..