AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Slice Payments: మీరు ఆ యాప్‌ వాడితే అంతే.. వినియోదారులను హెచ్చరించిన గూగుల్..

యూజర్ల వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేసేందుకు స్లైస్‌ యాప్ ప్రయత్నిస్తోందని గూగుల్ వినియోగదారులను హెచ్చరించింది. క్రెడిట్‌ కార్డ్‌లకు ప్రత్యామ్నయమని చెప్పుకునే ఈ స్లైస్‌ యాప్‌ వినియోగదారుల పర్సనల్‌ డేటాను స్పై చేయాడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది...

Slice Payments: మీరు ఆ యాప్‌ వాడితే అంతే.. వినియోదారులను హెచ్చరించిన గూగుల్..
Slice
Srinivas Chekkilla
|

Updated on: Jun 25, 2022 | 2:20 PM

Share

యూజర్ల వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేసేందుకు స్లైస్‌ యాప్ ప్రయత్నిస్తోందని గూగుల్ వినియోగదారులను హెచ్చరించింది. క్రెడిట్‌ కార్డ్‌లకు ప్రత్యామ్నయమని చెప్పుకునే ఈ స్లైస్‌ యాప్‌ వినియోగదారుల పర్సనల్‌ డేటాను స్పై చేయాడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న టూల్‌ను గుర్తించేలా గూగుల్‌ప్లే ప్రొటెక్ట్‌ టూల్‌ పనిచేస్తుందని గుర్తించింది. ఆ టూల్‌.. స్లైస్‌ వినియోగదారుల డేటాను దొంగిలించే అవకాశం ఉందని గుర్తించినట్లు స్పష్టం చేసింది. స్లైస్‌ పంపిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా యూజర్ని ప్లే ప్రొటెక్ట్ పేజీకి వెళ్తుంది. ఇది మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు లేదా కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాను స్పైస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక హానికరమైన అప్లికేషన్ ఉన్నట్లు గుర్తించామని గూగుల్‌ వెల్లడించింది. యాప్‌ను అన్ ఇన్ స్టాల్ చేయాలని యూజర్లను కోరింది. శుక్రవారం సాయంత్రం స్లైస్ యొక్క ఆండ్రాయిడ్ యాప్ అప్‌డేట్ యాప్ వినియోగదారులకు Google Play Protect నుంచి ఇందకు సంబంధించి సందేశం పంపింది.

గూగుల్‌ గుర్తించిన సమస్యను పరిశోధించి 4 గంటల్లో దీనిని పరిష్కరించామని స్లైస్‌ చెప్పింది. సమస్యను ఎదుర్కొంటున్న తమ వినియోగదారులను వారి యాప్‌ని మళ్లీ ఇన్‌స్టాల్ చేసి, తక్షణమే వెర్షన్ 10.0.7.3ని ఉపయోగించాలని కోరింది. అంతేకాదు 1శాతం మంది యాప్‌ వినియోగదారులు పాత వెర్షన్‌లో ఉన్నారని, వాళ్లు లేటెస్ట్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేయాలని స్లైస్‌ అభ్యర్థించింది. స్లైస్ ఇప్పటికే దేశ సెంట్రల్ బ్యాంక్‌తో మాట్లాడింది. వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్‌లు వంటి నాన్-బ్యాంకింగ్ ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPIలు) తమ ప్లాట్‌ఫారమ్‌లపై క్రెడిట్ లైన్‌లను లోడ్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నిషేధించింది. నాన్-బ్యాంకింగ్ సంస్థలు తమపై క్రెడిట్ లైన్లను లోడ్ చేయలేవని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. దీని వల్ల ప్రభావితమయ్యే కంపెనీల్లో స్లైస్, యూనికార్డ్‌లు కూడా ఉన్నాయి.