నగదు లావాదేవీలపై సరికొత్త నిబంధనలు.. ఇకపై అవి చూపించాల్సిందే.. లేదంటే కష్టమే.. మే 26 నుంచి అమలు..
బ్యాంకు లేదా పోస్టాఫీసులో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లేదా పోస్టాఫీసులో..
బ్యాంకు లేదా పోస్టాఫీసులో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లేదా పోస్టాఫీసులో రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే ఇకపై తప్పనిసరిగా పాన్, ఆధార్ అవసరం కానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను (15వ సవరణ) రూల్స్, 2022 ప్రకారం కొత్త నిబంధనలను రూపొందించింది. దీని నోటిఫికేషన్ 10 మే 2022 తేదీన జారీ చేశారు. అయితే, ఈ కొత్త నిబంధనలు మే 26 నుంచి వర్తించనున్నాయి.
ఈ లావాదేవీలలో పాన్ లేదా ఆధార్ వివరాలు తప్పనిసరి..
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ కంపెనీ లేదా కార్పోరేటివ్ బ్యాంక్ లేదా ఏదైనా ఒక పోస్టాఫీసులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో రూ. 20 లక్షల నగదు జమ చేయడానికి కచ్చితంగా తప్పనిసరి చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకు లేదా పోస్టాఫీసులోని ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల నుండి నగదు ఉపసంహరణ రూ. 20 లక్షలు అంతకంటే ఎక్కువపైనా పాన్, ఆధార్ తప్పనిసరి చేసింది. బ్యాంకింగ్ కంపెనీ, కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరిచినప్పుడు కూడా వీటిని తప్పనిసరి చేసింది.
కరెంట్ ఖాతా తెరవడానికి పాన్ కార్డ్ అవసరం..
ప్రస్తుతం ఎవరైనా కరెంట్ ఖాతాను తెరవడానికి వారి పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. అదే సమయంలో బ్యాంక్ ఖాతా ఇప్పటికే పాన్‌తో లింక్ చేసిన వ్యక్తులు కూడా లావాదేవీల సమయంలో ఈ నియమాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Cyclone Asani: అసని ఎఫెక్ట్‌తో విశాఖ నుంచి ఆగిన విమాన సర్వీసులు పునరుద్ధరణ