IPL 2022: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన బౌలర్లు.. సొంత జట్టు పాలిట విలన్లు.. ఎందుకో తెలుసా?

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పాట్ కమిన్స్ డేనియల్ సామ్స్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 35 పరుగులు పించేశాడు. దీంతో సామ్స్‌కు కన్నీళ్లే మిగిలాయి.

IPL 2022: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన బౌలర్లు.. సొంత జట్టు పాలిట విలన్లు.. ఎందుకో తెలుసా?
Harshal Patel, Ipl 2022
Follow us

|

Updated on: May 09, 2022 | 12:48 PM

ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్‌లో, డానియల్ సామ్స్ వేసిన ఒక ఓవర్‌లో పాట్ కమిన్స్ 35 పరుగులు పించుకున్నాడు. సామ్స్ వేసిన ఈ ఓవర్ ఐపీఎల్(IPL) చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది. ఒక బౌలర్ ఒక ఓవర్లో 30 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి బౌలర్లు చాలామందే ఉన్నారు. అత్యధిక పరుగులు చేసిన బౌలర్లను ఓసారి చూద్దాం..

హర్షల్ పటేల్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 1 ఓవర్లో 37 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా హర్షల్ పటేల్ వేసిన ఒక ఓవర్లో 37 పరుగులు పించుకుని, బౌలర్‌కు కన్నీళ్లు మిగిల్చాడు.

ఇవి కూడా చదవండి

Also Read: IPL 2022: 8 బంతులు, 262 స్ట్రైక్‌రేట్.. అట్లుంటది మరి ధోనితోని.. బౌలర్లకు చుక్కలు.. రికార్డులన్నీ బ్రేక్..

ప్రశాంత్ పరమేశ్వరన్..

2011 IPLలో, కొచ్చి టస్కర్స్ కేరళ ఫాస్ట్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ ఒక ఓవర్లో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కొచ్చి టస్కర్స్ కేరళ జట్ల మధ్య జరిగింది. ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఈ ఓవర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.

డేనియల్ సామ్స్..

ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ డేనియల్ సామ్స్ వేసిన ఒక ఓవర్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ పాట్ కమిన్స్ 35 పరుగులు రాబట్టాడు. ఈ విధంగా, 1 ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇవ్వడంలో సామ్స్ మూడో స్థానంలో నిలిచాడు. కమిన్స్‌ ఇన్నింగ్స్‌ కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం, ముంబై ఇండియన్స్‌‌ని సులభంగా ఓడించింది.

పర్విందర్ అవానా..

ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో పర్వీందర్ అవానా పేరు కూడా ఉంది. 2014 సంవత్సరంలో, పంజాబ్ కింగ్స్ (PBKS) బౌలర్ పర్వీందర్ అవానా 1 ఓవర్లో 33 పరుగులు ఇచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కింగ్స్ (PBKS) మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

రవి బొపారా..

అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ రవి బొపారా పేరు కూడా ఉంది. బొపారా వేసిన ఒక ఓవర్‌లో 33 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: బ్రేకుల్లేని బుల్డోజర్‌లా ధోని.. ప్లేఆఫ్స్‌కు చెన్నై చేరాలంటే.. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ మిగిలిన మ్యాచ్‌ల్లో!

IPL 2022: పంత్ బాటలోనే వార్నర్.. అంపైర్‌పై ఆగ్రహంతో కన్నెర్ర.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?