AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: పంత్ బాటలోనే వార్నర్.. అంపైర్‌పై ఆగ్రహంతో కన్నెర్ర.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 92 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా అతను మంచి ఫామ్‌లో కనిపించాడు. వార్నర్ 12 బంతుల్లో 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

IPL 2022: పంత్ బాటలోనే వార్నర్.. అంపైర్‌పై ఆగ్రహంతో కన్నెర్ర.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
David Warner
Venkata Chari
|

Updated on: May 09, 2022 | 10:49 AM

Share

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో సందడి చేస్తుండడాన్ని మనం చూస్తేనే ఉన్నాం. అయితే, మైదానంలో ఒక్కోసారి అలాంటి పనులతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో కూడా మరో యాంగిల్ చూపించి, నెట్టింట్లో వైరల్‌గా మారాడు. కీలక సమయంలో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో కోపంగా అంపైర్(Umpire) వైపు చూస్తూ, ఏదో అంటూ పెవిలియన్ చేరడం వీడియోలో చూడొచ్చు. అంతలా వార్నర్‌కు కోపం తెప్పించిన విషయం ఏమిటి? అని అనుకుంటున్నారా. అదే కీలక సమయంలో వికెట్ పడడం.. అంటే వార్నర్ ఔట్. డేవిడ్ వార్నర్ ఔటవ్వగానే అతనికి కోపం వచ్చింది. దీని కారణంగా అంపైర్ నితిన్ మీనన్‌పై చూపించాడు.

Also Read: IPL 2022: 11 మ్యాచ్‌ల్లో 3 సార్లు సున్నానే.. 10 ఏళ్లలో చెత్త సగటుతో బ్యాటింగ్.. ‘గోల్డెన్ డక్’లా మారిన రన్ మెషీన్..

డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 92 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కూడా అతను మంచి ఫామ్‌లో కనిపించాడు. వార్నర్ 12 బంతుల్లో 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆపై మహిష్ తీక్షణ వేసిన బంతికి అంపైర్ అతనిని ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించాడు. ఈ విషయంపై, వార్నర్ మూడ్ పూర్తిగా పాడైంది. దీంతో చాలా కోపంగా అంపైర్‌ను ఎగాదిగా చూశాడు.

ఇవి కూడా చదవండి

అంపైర్ వైపు చూస్తూ..

ఇదంతా పవర్‌ప్లేలో జరిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో 5వ ఓవర్ కొనసాగుతోంది. మహిష్ తీక్షణ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఈ ఓవర్ రెండో బంతికి వార్నర్‌ను ఎల్‌బీడబ్ల్యూ అంటూ ఫీల్డర్లు అప్పీల్ చేశారు. ప్రత్యర్థుల అప్పీల్‌పై అంపైర్ నితిన్ మీనన్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతని ముఖంలో అసంతృప్తి కనిపించింది. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అదే ఎర్రటి కళ్లతో అంపైర్ నితిన్ మీనన్‌ను చూస్తూ, ఏదో సైగ చేస్తూ.. డగౌట్ వైపు కదిలాడు. వార్నర్ ఆగ్రహంతో కూడిన ఈ 8 సెకన్ల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

టర్నింగ్ పాయింట్ వార్నర్ వికెట్..

వార్నర్ వికెట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఎందుకంటే ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై CSK 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. అందుకే వార్నర్ ఆగ్రహానికి గురయ్యాడు.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: 8 బంతులు, 262 స్ట్రైక్‌రేట్.. అట్లుంటది మరి ధోనితోని.. బౌలర్లకు చుక్కలు.. రికార్డులన్నీ బ్రేక్..

బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న రూ.10.75 కోట్ల ప్లేయర్.. పర్పుల్ క్యాప్ లిస్టులో తగ్గేదేలే అంటోన్న ఆర్‌సీబీ బౌలర్..