IPL 2022: 8 బంతులు, 262 స్ట్రైక్‌రేట్.. అట్లుంటది మరి ధోనితోని.. బౌలర్లకు చుక్కలు.. రికార్డులన్నీ బ్రేక్..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ రెండు భారీ సిక్సర్లు బాదాడు.

IPL 2022: 8 బంతులు, 262 స్ట్రైక్‌రేట్.. అట్లుంటది మరి ధోనితోని.. బౌలర్లకు చుక్కలు.. రికార్డులన్నీ బ్రేక్..
Ms Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: May 09, 2022 | 6:40 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోటీ పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే తన పేరిట ఒక భారీ రికార్డును సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మహేంద్ర సింగ్ ధోనీ కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో ఎంఎస్ ధోని స్ట్రైక్ రేట్ 262గా నిలిచింది. ధోని ఆటతీరుతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 208కి చేరుకోగలిగింది. ఈ ఇన్నింగ్స్‌తో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా టీ20లో 6000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టాప్-3 కెప్టెన్లలో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

T20లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్లు..

• విరాట్ కోహ్లీ – 6451 పరుగులు

ఇవి కూడా చదవండి

• ఎంఎస్ ధోని – 6013 పరుగులు

• రోహిత్ శర్మ – 4764 పరుగులు

• ఆరోన్ ఫించ్ – 4603 పరుగులు

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు గురించి మాట్లాడితే, అతను 5000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 91 పరుగుల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 231 మ్యాచ్‌ల్లో 4909 పరుగులు చేసిన ధోని 226 సిక్సర్లు కొట్టాడు.

IPLలో MS ధోని –

• మొత్తం మ్యాచ్‌లు – 236

• మొత్తం పరుగులు – 4909 పరుగులు

• సగటు – 39.27

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 208 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున డెవాన్ కాన్వే 49 బంతుల్లో 87 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఎంఎస్ ధోని వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్‌తో పరుగులు రాబట్టడంతోపాటు జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి దూరంగా ఉంది. అయితే, ఇతర జట్ల లెక్కలను మార్చడంలో మాత్రం చాలా కీలకంగా మారుతోంది. డిఫరెంట్ కాంబినేషన్‌లో ట్రై చేస్తున్నామని ఎంఎస్ ధోని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022 Points Table: ప్లే ఆఫ్‌ రేసుకి తగ్గా పోటీ.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు..

IPL 2022: 12 బంతుల్లోనే 58 పరుగులు పిండేశాడు.. అతడి ధాటికి ఆ ఢిల్లీ బౌలర్‌ బలి..!