IPL 2022 Points Table: ప్లే ఆఫ్‌ రేసుకి తగ్గా పోటీ.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు..

IPL 2022 Points Table: IPL 2022 లీగ్ దశలో ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్లేఆఫ్ పోరు ఉత్కంఠ స్థాయికి చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లతో IPL పాయింట్ల ప

IPL 2022 Points Table: ప్లే ఆఫ్‌ రేసుకి తగ్గా పోటీ.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు..
Ipl 2022, Ipl Points Table
Follow us
uppula Raju

|

Updated on: May 09, 2022 | 6:31 AM

IPL 2022 Points Table: IPL 2022 లీగ్ దశలో ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్లేఆఫ్ పోరు ఉత్కంఠ స్థాయికి చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లతో IPL పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రాజర్స్ హైదరాబాద్‌ను భారీ తేడాతో ఓడించి నాలుగో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 91 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. రన్‌ రేట్‌ మెరుగుపరుచుకుంది. డెవాన్ కాన్వే 87 పరుగులు చేయడం వల్ల చెన్నై 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతేకాదు మొయిన్‌ అలీ 3 వికెట్లతో విజృంభించడంతో ఢిల్లీ 117 పరుగులకే కుప్పకూలింది. చెన్నై 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో CSKకి రెండు పాయింట్లు రావడమే కాకుండా నెట్ రన్ రేట్‌ మెరుగైంది. ఇప్పుడు CSK, KKRతో 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ నెట్‌ రన్‌ రేట్‌లో తేడా కారణంగా చెన్నై ముందు వరుసలో నిలిచింది. ఇప్పుడు ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

ఆర్సీబీ ఆధిక్యంలో..

ఒకవైపు MS ధోని చెన్నైకి పెద్ద విజయాన్ని అందించగా.. అతని చిరకాల మిత్రుడు ఫాఫ్ డు ప్లెసిస్ కూడా బెంగుళూరు జట్టుకి భారీ విజయాన్ని అందించాడు. డు ప్లెసిస్ అజేయంగా 73 పరుగుల సాయంతో బెంగళూరు 192 పరుగులు చేసింది. తర్వాత శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా 5 వికెట్లు పడగొట్టి భయాందోళనలు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 67 పరుగుల తేడాతో ఓడించాడు. బెంగళూరు 2 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే భారీ విజయంతో నెట్ రన్ రేట్ కాస్త మెరుగుపడింది. అయితే రాయల్‌ ఛాలెంజర్‌ బెంగుళూరు ఈ రెండు ఫలితాల నుంచి ఎక్కువ ప్రయోజనాన్ని పొందినదని చెప్పవచ్చు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CSK vs DC: ఇరగదీసిన చెన్నై బౌలర్లు.. తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు..

CLAT Exam 2022: క్లాట్‌ పరీక్షకి అప్లై చేయడానికి చివరి తేది దగ్గరపడింది.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

IPL 2022: జోస్‌ బట్లర్ ప్రత్యేక రికార్డ్‌.. ఆ విషయంలో తొలి రాజస్థాన్‌ ఆటగాడు..!