- Telugu News Photo Gallery Cricket photos Jos buttler becomes the first rajasthan royals batsman to score 600 runs in ipl 2022
IPL 2022: జోస్ బట్లర్ ప్రత్యేక రికార్డ్.. ఆ విషయంలో తొలి రాజస్థాన్ ఆటగాడు..!
IPL 2022: జోస్ బట్లర్ IPL 2022లో మెరుస్తూనే ఉన్నాడు. ఈ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినప్పుడల్లా పరుగుల వర్షం కురుస్తుంది. రికార్డులు బద్దలవుతున్నాయి.
Updated on: May 07, 2022 | 8:44 PM

జోస్ బట్లర్ IPL 2022లో మెరుస్తూనే ఉన్నాడు. ఈ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినప్పుడల్లా పరుగుల వర్షం కురుస్తుంది. రికార్డులు బద్దలవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో అతను రాజస్థాన్ రాయల్స్ ఏ బ్యాట్స్‌మెన్ సాధించలేని ఫీట్ సాధించాడు.

పంజాబ్ కింగ్స్‌పై జోస్ బట్లర్ 13 పరుగులు చేసిన వెంటనే అతను IPL 2022లో 600 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో 600 పరుగులు చేసిన తొలి రాజస్థాన్ ఆటగాడు బట్లర్. అంతకుముందు అజింక్య రహానే 2012లో అత్యధికంగా 560 పరుగులు చేశాడు.

పంజాబ్‌పై జోస్ బట్లర్ 30 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ 2022లో మొత్తం 618 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నా.. ఇప్పుడు విరాట్ కోహ్లీ రికార్డు దిశగా దూసుకుపోతున్నాడు. 2016 సంవత్సరంలో విరాట్ కోహ్లి 973 పరుగులు చేశాడు.

బట్లర్ 11 ఇన్నింగ్స్‌ల తర్వాత 618 పరుగులు సాధించాడు. 2016లో విరాట్ కోహ్లీ అదే ఇన్నింగ్స్‌లో 677 పరుగులు చేశాడు. బట్లర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ కంటే వెనుకబడి ఉన్నాడు.

పంజాబ్ కింగ్స్‌పై జోస్ బట్లర్ చాలా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. రబాడ వేసిన ఒకే ఓవర్‌లో 20 పరుగులు చేశాడు. కానీ చివరి బంతికి రివర్స్ స్కూప్ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు.



