- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Rajasthan Royals Spinner Yuzvendra Chahal equals Lasith Malinga's record to take 20 or more wickets in 4 different seasons in IPL
IPL 2022: మలింగ రికార్డును సమం చేసిన చాహల్.. బుమ్రా-భువనేశ్వర్‌లకే సాధ్యం కాలే.. అదేంటంటే?
చాలా కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన చాహల్, IPL 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, జట్టు మార్పు కారణంగా అతని ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
Updated on: May 07, 2022 | 8:46 PM

ఐపీఎల్‌లో సీజన్ తర్వాత నిలకడ ప్రదర్శనల విషయానికి వస్తే, సాధారణంగా బ్యాట్స్‌మెన్ గురించి చర్చ జరుగుతుంది. బౌలర్ల విషయానికి వస్తే, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, డ్వేన్ బ్రేవో, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ల గురించి మాట్లాడుతుంటారు. అయితే దాదాపు ప్రతి సంవత్సరం IPL లో తనదైన ముద్ర వేసిన యుజ్వేంద్ర చాహల్ పేరు కూడా ఈ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. చాహల్ ఎంతో నిలకడ ప్రదర్శినతో ఆకట్టుకుని, లసిత్ మలింగ భారీ రికార్డును సమం చేశాడు.

చాలా కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన చాహల్, IPL 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, జట్టు మార్పు కారణంగా అతని ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మే 7 శనివారం పంజాబ్ కింగ్స్‌పై చాహల్ 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే వెచ్చించి 3 వికెట్లు పడగొట్టాడు.

దీని తర్వాత, ఈ స్టార్ లెగ్ స్పిన్నర్ ప్రస్తుత సీజన్‌లో కేవలం 11 మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టాడు. చాహల్ IPL 2022లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానే కాదు.. ప్రస్తుతం IPLలో 4 సార్లు (2015, 2016, 2020, 2022) సీజన్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఈ విషయంలో చాహల్ శ్రీలంక దిగ్గజం, మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్, ప్రస్తుత రాజస్థాన్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగను సమం చేశాడు. ఇప్పటి వరకు మలింగ మాత్రమే 4 సీజన్లలో 20కి పైగా వికెట్లు తీశాడు. అతని తర్వాత భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్ తలో 3 సార్లు ఈ ఘనత సాధించారు.




