- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 Mumbai Indians bowler murugan ashwin 2 key wickets in one over vs gujarat titans gt vs mi match
IPL 2022: గుజరాత్ ఓటమిలో ఆ బౌలర్‌దే కీలక పాత్ర.. ప్లాన్ చేసి ఓడించిన రోహిత్ సేన.. ఆ ప్లేయర్ ఎవరంటే?
గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం, రోహిత్ శర్మతో సహా మొత్తం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ చివరికి ముంబై తన ప్లాన్‌ను అమలు చేసి విజయాన్ని దక్కించుకుంది.
Updated on: May 07, 2022 | 2:47 PM

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు ఎట్టకేలకు విజయాల బాట పట్టినట్లే ఉంది. ఈ సీజన్‌లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడి.. టైటిల్ రేసు నుంచి రోహిత్ శర్మ జట్టు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. దీంతో ఇతర జట్ల భవితవ్యాలు ముంబై జట్టుపై ఆధారపడి ఉన్నాయనడంలో సందేహం లేదు. రాజస్థాన్ రాయల్స్ తర్వాత ముంబై ఇండియన్స్ టీం కూడా గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన గుజరాత్ ఓటమిలో ముంబై ఇండియన్స్ చేసిన ఓ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషించింది. టాస్ సందర్భంగా రోహిత్ బాహాటంగానే ఈ విషయం వెల్లడించాడు.

బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒకే ఒక్క మార్పు చేసింది. యువ స్పిన్నర్ హృతిక్ షోకీన్ స్థానంలో వెటరన్ లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌ని తీసుకున్నారు. ఇదే విషయంపై రోహిత్‌ని ప్రశ్నించగా.. మ్యాచ్‌ని చూస్తుంటే వ్యూహాత్మక మార్పులు అవసరమని ఓపెన్‌గా చెప్పేశాడు. అంటే అశ్విన్‌ను దృష్టిలో పెట్టుకుని ముంబై గుజరాత్‌కు భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది.

అయితే, గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్ ఇద్దరూ మొదటి 12 ఓవర్లకు బౌలర్లను చిత్తు చేసి 106 పరుగులు జోడించడంతో ముంబై ప్రణాళిక ఫలించటానికి చాలా సమయం పట్టింది.

ఆ తర్వాత 13వ ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అదే అతని చివరి ఓవర్. ఇక్కడే అతను మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ ఓవర్ తొలి బంతికే గిల్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి 4 బంతుల్లో 5 పరుగులు మాత్రమే వెచ్చించి, చివరి బంతికి సాహా వికెట్ కూడా పడగొట్టాడు. అంటే సెట్ బ్యాట్స్ మెన్ ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. ముంబై తిరిగి రావడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అశ్విన్ తన 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు మ్యాచ్ టర్నింగ్ వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో ముంబై మ్యాచ్‌ను గెలిచేలా చేసింది.




