- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Delhi Captials allrounder Rovman Powell promosied to his mother and sister to remove poverty; rovman powell untold story
IPL 2022: తండ్రి చంపాలనుకున్నాడు.. కానీ, తల్లి పోరాడింది.. కరీబియన్ నుంచి ఐపీఎల్ స్టార్‌గా మారిన ప్లేయర్..
తల్లి కడుపులో ఉన్నప్పుడు, ఈ ఆటగాడి తండ్రి అబార్షన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, తల్లి అంగీకరించలేదు. నేడు అదే బిడ్డ తల్లి పేరుతోపాటు, దేశాని పేరు తెస్తున్నాడు.
Updated on: May 06, 2022 | 6:26 PM

వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెల్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తన బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున ఆడుతున్న పావెల్.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 21 పరుగులతో అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఢిల్లీ జట్టు స్టార్ ప్లేయర్ పావెల్ తన సత్తా చాటాడు. 35 బంతుల్లో 67 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 6 లాంగ్ సిక్సర్లు కొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, సీన్ అబోట్‌లను ఓ ఆటాడేసుకున్నాడు. ఈ సమయంలో రోవ్‌మన్ పావెల్ స్ట్రైక్ రేట్ 191.43గా నిలిచింది.

28 ఏళ్ల పావెల్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ మెగా వేలంలో రూ.2.80 కోట్లకు కొనుగోలు చేసింది. వెస్టిండీస్‌లోని జమైకాలో జన్మించిన ఈ స్టార్ ఆటగాడు.. ప్రస్తుతం ఆనందంగా జీవితాన్ని గడుపుతుండొచ్చు.. కానీ అతని బాల్యం అంతా పోరాటాలతోనే గడిచింది. అతని కథ విన్నవారంతా ఆశ్చర్యపోతారు.

నిజానికి, రోవ్‌మాన్ పావెల్.. తల్లి కడుపులో ఉన్నప్పుడు, తండ్రి అబార్షన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, తల్లి అంగీకరించలేదు. నేడు అదే బిడ్డ తల్లి పేరుతోపాటు, దేశాని పేరు తెస్తున్నాడు.

రోవ్‌మాన్, అతని సోదరిని చదివించేందుకు తల్లి పలు ఇళ్లల్లో బట్టలు కూడా ఉతికేది. రోవ్‌మాన్ వెస్టిండీస్‌లోని జమైకాలోని ఓల్డ్ హార్బర్‌లోని బన్నిస్టర్ జిల్లాలో జన్మించాడు.

ఇటీవల, వెస్టిండీస్ లెజెండ్ ఇయాన్ బిషప్ మాట్లాడుతూ, అతను సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు పేదరికం నుంచి బయటపడేస్తానని తన తల్లికి వాగ్దానం చేశానని చెప్పుకొచ్చాడు. అదే వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు తన కలను సాకారం చేసుకుంటున్నాడు. ఇదొక గొప్ప కథ. 2019లో, రోవ్‌మాన్ తన తల్లికి కారును బహుమతిగా ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో, పావెల్ తల్లి తన కొడుకు చాలా అల్లరిగా ఉంటాడని, అయితే అంతే తెలివిగలవాడని పేర్కొంది.




