AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CLAT Exam 2022: క్లాట్‌ పరీక్షకి అప్లై చేయడానికి చివరి తేది దగ్గరపడింది.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

CLAT Exam 2022: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (CLAT) పరీక్ష రిజిస్ట్రేషన్ విండో మే 9న మూసివేస్తారు. ఫీజు సమర్పించడానికి చివరి తేదీ మే 11. ఇంకా దరఖాస్తు చేసుకోని

CLAT Exam 2022: క్లాట్‌ పరీక్షకి అప్లై చేయడానికి చివరి తేది దగ్గరపడింది.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!
Clat Exam 2022
uppula Raju
|

Updated on: May 07, 2022 | 9:02 PM

Share

CLAT Exam 2022: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (CLAT) పరీక్ష రిజిస్ట్రేషన్ విండో మే 9న మూసివేస్తారు. ఫీజు సమర్పించడానికి చివరి తేదీ మే 11. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మే 11లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు దరఖాస్తులని సమర్పించి ఇంకా రుసుము చెల్లించనివారు 11 మే 2022 (బుధవారం) 11:59 PM వరకు చెల్లింపు చేయవచ్చు. CLAT అప్లికేషన్ ఫీజు అన్‌రిజర్వ్డ్ అభ్యర్థులకు రూ.4,000, SC / ST, OBC అభ్యర్థులకు రూ.3,500గా నిర్ణయించారు.

CLAT పరీక్ష కోసం ఎలా నమోదు చేసుకోవాలి..?

1 అభ్యర్థి CLAT అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.

2. CLAT 2022 లింక్‌పై క్లిక్ చేయాలి.

3. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని ఉపయోగించి నమోదు చేసుకోవాలి.

4. వ్యక్తిగత సమాచారం, విద్యా వివరాలు, కమ్యూనికేషన్ వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.

5. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి ఫీజు చెల్లింపును పూర్తి చేయాలి.

ఏదైనా సమస్య ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌ సంప్రదించవచ్చు

మే 11 తర్వాత CLAT పరీక్షా కేంద్రాలు, మరే ఇతర వివరాలు మార్చలేరని అభ్యర్థులు గమనించాలి. ఏదైనా సహాయం విషయంలో అభ్యర్థులు కింద ఇచ్చిన CLAT హెల్ప్ డెస్క్‌ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ మెయిల్ న్: 080-47162020 ఇది అన్ని రోజులు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 05:00 వరకు అభ్యర్థులకు అందుబాటులు ఉంటుంది.

జూన్ 19న పరీక్ష

CLAT పరీక్ష 2022 జూన్ 19, 2022న ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము చెల్లించిన అభ్యర్థులకి పరీక్షకు కొన్ని రోజుల ముందుగానే CLAT అడ్మిట్ కార్డ్‌లు జారీ అవుతాయి. CLAT రిజిస్ట్రేషన్ విండో మే 9న మూసివేస్తారు. ఈ తేదీవరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. అభ్యర్థులు గమనిస్తూ ఉండాలి.

మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: జోస్‌ బట్లర్ ప్రత్యేక రికార్డ్‌.. ఆ విషయంలో తొలి రాజస్థాన్‌ ఆటగాడు..!

ICE Tea Side Effects: వేసవిలో ఐస్‌ టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే దాని జోలికి అస్సలు వెళ్లరు..!

Mahatama Gandhi: బ్రిటన్‌లో మహాత్మాగాంధీ వస్తువులు వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?