Mahatama Gandhi: బ్రిటన్‌లో మహాత్మాగాంధీ వస్తువులు వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?

Mahatama Gandhi: జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన వస్తువులను బ్రిటన్‌లో వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని

Mahatama Gandhi: బ్రిటన్‌లో మహాత్మాగాంధీ వస్తువులు వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?
Mahatama Gandhi
Follow us
uppula Raju

|

Updated on: May 07, 2022 | 6:54 PM

Mahatama Gandhi: జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన వస్తువులను బ్రిటన్‌లో వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా ఐదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వేలంలో మహాత్మాగాంధీ లుంగీ, చెప్పులు, ఆయన జీవితంలో తీసిన చివరి ఫోటో మొదలైనవి ఉన్నాయి. దాదాపు మొత్తం 70 వస్తువులను వేలం వేయనున్నారు. ఇందులో ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసిన లేఖలు కూడా ఉన్నాయి. వేలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు వసూలవుతాయని ఈస్ట్ బ్రిస్టల్ వేలంపాట విశ్వసిస్తోంది. ఈ వేలం హౌస్ ఇంతకుముందు 2020 సంవత్సరంలో జాతిపిత గాజులను 2.5 కోట్ల రూపాయలకు వేలం వేసింది. ఈ వస్తువుల సేకరణ ప్రపంచ చరిత్రకు చాలా ముఖ్యమైనదని నిర్వాహకులు చెప్పారు.

వేలంలో గాంధీ చిత్రపటం అత్యంత ప్రత్యేకం

ఈ వేలంలో వేసే గాంధీ చిత్రం గాంధీ హత్యకు గురైన ప్రదేశంలో తీశారు. వేలం నిర్వాహకులు ఆండ్రూ మాట్లాడుతూ.. ‘ఇది చాలా ప్రత్యేకమైన ఫొటో. ఇది ఒక లక్ష రూపాయల వరకు ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోటో గాంధీ వ్యక్తిగత వైద్యుడు తీసి ఉండవచ్చని భావిస్తున్నాం. ఇది అతని చివరి ఫొటో అయి ఉంటుంది. ఈ చిత్రం 1947లో ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో తీశారు. ఇందులో గాంధీ కుర్చీలో కూర్చొని ఉంటాడు’

జాతిపిత నడుము పట్టీని కూడా వేలం వేస్తున్నారు

వేలం వేయనున్న వస్తువులలో జాతిపిత రెండు జతల చెప్పులు కూడా ఉన్నాయి. వీటికి దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల మధ్య వేలం వేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో గాంధీజీకి నడుము పట్టీ కూడా ఉంది. దీనిని ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు వేలం వేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు పూనాలో జైలులో ఉన్నప్పుడు రాసిన లేఖను కూడా వేలం వేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: గాల్లో ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన బట్లర్.. షాక్‌ అయిన గబ్బర్..!

Viral Video: గాలిలో గద్దల మధ్య పోటీ.. చేపని ఎలా క్యాచ్‌ పట్టిందో చూస్తే నోరెళ్లబెడుతారు..!

IPL 2022: మళ్లీ మిస్‌ అయింది.. పదోసారి టాస్‌ ఓడిపోయిన సంజూ శాంసన్..!..