మధ్యప్రదేశ్లోని కట్ని జిల్లా సడార్ అటవీ ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో ఉన్న శివలింగంపై ఒక పులి తన తలను రుద్దుకుంటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వన్యజీవి ప్రవర్తన, భక్తి చిహ్నంగా భావించే శివలింగం మధ్య చోటుచేసుకున్న ఈ దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.