AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గాలిలో గద్దల మధ్య పోటీ.. చేపని ఎలా క్యాచ్‌ పట్టిందో చూస్తే నోరెళ్లబెడుతారు..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. నెటిజన్లు ఈ వీడియోలని బాగా

Viral Video: గాలిలో గద్దల మధ్య పోటీ.. చేపని ఎలా క్యాచ్‌ పట్టిందో చూస్తే నోరెళ్లబెడుతారు..!
Two Eagles
uppula Raju
|

Updated on: May 07, 2022 | 5:18 PM

Share

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. నెటిజన్లు ఈ వీడియోలని బాగా ఎంజాయ్‌ చేస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో అలరిస్తారు. ఇంటర్‌నెట్‌లో జంతువులు, పక్షుల వేటకి సంబంధించిన కంటెంట్‌కి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నెటిజన్లు ఇలాంటి వీడియోలని పదే పదే చూస్తారు. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఎర కోసం రెండు గద్దల మధ్య పోటీ ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక గద్ద చేపని వేటాడి గాల్లో ఎగురుతూ వెళ్లడం మనం చూడవచ్చు. అయితే దాని వెంబడి మరో గద్ద వెళుతుంటుంది. అది మొదటి గద్ద నుంచి ఎరని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా గాల్లో రెండు గద్దలు ఎరకోసం పోటీ పడుతుంటాయి. ఇంతలో మొదటి గద్ద మరింత పైకి ఎగిరే క్రమంలో చేప కాళ్లసందులో నుంచి జారి కిందపడబోతుంది. ఇంతలో వెనుక ఉన్న మరో గద్ద దానిని చాకచక్యంగా కాళ్లతో అదిమి పట్టుకుంటుంది. ఈ క్యాచ్‌ని చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. గద్ద నైపుణ్యానికి ఆశ్చర్యపోతున్నారు. రకరకరాల కామెంట్లతో స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. వార్తలు రాసే సమయానికి ఈ వీడియోని 1600 కంటే ఎక్కువ మంది వీక్షించారు. దీంతోపాటు లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ని తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: అదృష్టం మళ్లీ మోసం చేసింది.. పదోసారి టాస్‌ ఓడిపోయిన సంజూ శాంసన్..!

Maruti Suzuki Wagonr: మారుతి వ్యాగన్‌ ఆర్‌ నెంబర్‌ వన్‌.. దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కారు.. దీనికి కారణాలు ఏంటో తెలుసా..?

Health Tips: పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ప్రయోజనాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!