AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ప్రయోజనాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Health Tips: ఉసిరిలో పోషకాలు పుష్కలం. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే అన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Health Tips: పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ప్రయోజనాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Amla Murabba
uppula Raju
|

Updated on: May 07, 2022 | 3:36 PM

Share

Health Tips: ఉసిరిలో పోషకాలు పుష్కలం. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే అన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కానీ ఉసిరికాయ చాలా పుల్లగా ఉంటుంది. కాబట్టి అందరూ దీనిని తినలేరు. ఈ పరిస్థితిలో ఉసిరి జామ్‌ (ఆమ్లా మురబ్బా అంటే ఉసిరితో తయారుచేసిన ఒక తియ్యటి పదార్థం) మంచి ఎంపికని చెప్పవచ్చు. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రతిరోజూ పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉసిరి జామ్‌ ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ ప్రభావం వల్ల కలిగే అన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

2. రక్త నష్టాన్ని తొలగిస్తుంది

శరీరంలో రక్త లోపం ఉన్నవారు ప్రతిరోజూ ఒక ఉసిరి జామ్‌ను తినాలి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని నిత్యం తినడం వల్ల శరీరంలో రక్త లోపం తొలగిపోయి రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

3. గ్యాస్ ఎసిడిటీని దూరం చేస్తాయి

గ్యాస్, అసిడిటీ లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి జామ్‌ తింటే ఉపశమనం పొందవచ్చు. అంతే కాకుండా ఉసిరికాయలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి చాలా మంచిదని భావిస్తారు. ఇది రక్త శుద్ధి, అలాగే వృద్ధాప్య ప్రభావాలను నివారిస్తుంది.

4. గుండెకు మంచిది

ఉసిరి గుండెకు సంబంధించిన అన్ని సమస్యలను నివారిస్తుంది. ఇందులో క్రోమియం, జింక్, కాపర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల వాపును తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉసిరి జామ్ గుండెకు సంబంధించిన అన్ని సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. గర్భధారణలో ఉపయోగకరంగా ఉంటుంది

గర్భిణులు ప్రతిరోజూ పరగడుపున ఈ జామ్‌ తినాలి. ఇది వారికి పుట్టబోయే బిడ్డకి చాలా మంచిది. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. జుట్టు రాలడం సమస్య అదుపులో ఉంటుంది. కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. అలాగే శరీరంలో రక్తానికి లోటు ఉండదు.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: క్యాన్సర్‌ రావొద్దంటే ఈ ఆహారాలకి దూరంగా ఉండాలి.. అవేంటంటే..?

Health Tips: విటమిన్ బి-12 లోపిస్తే చాలా ప్రమాదం.. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!

Bill Gates: కరోనా తర్వాత ఇప్పుడు మరో మహమ్మారి.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ హెచ్చరిక..!

Health Tips: క్యాన్సర్‌ రావొద్దంటే ఈ ఆహారాలకి దూరంగా ఉండాలి.. అవేంటంటే..?