Health Tips: క్యాన్సర్‌ రావొద్దంటే ఈ ఆహారాలకి దూరంగా ఉండాలి.. అవేంటంటే..?

Health Tips: నేడు ప్రపంచంలో అత్యంత తీవ్రమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఇందులో అనేక రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం

Health Tips: క్యాన్సర్‌ రావొద్దంటే ఈ ఆహారాలకి దూరంగా ఉండాలి.. అవేంటంటే..?
Foods
Follow us

|

Updated on: May 06, 2022 | 1:27 PM

Health Tips: నేడు ప్రపంచంలో అత్యంత తీవ్రమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఇందులో అనేక రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా కణితులు ఏర్పడతాయి. ప్రారంభంలో ఇది అంత ప్రమాదకరం కాదు కానీ కాలం గడిచినకొద్ది చాలా ప్రమాదకరంగా మారతాయి. క్యాన్సర్ జన్యుపరమైనది అయితే ఇది 5 నుంచి 10 శాతం కేసులలో మాత్రమే కనిపిస్తుంది. కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం వారు సరైన జీవనశైలిని అలవర్చుకోవడం అవసరం. మద్యం, ధూమపానానికి వీలైనంత దూరంగా ఉండాలి. అదే సమయంలో ఆహారంపై శ్రద్ధ వహించాలి. తరచుగా క్యాన్సర్‌ను ప్రోత్సహించే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాంటి ఆహారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1. ప్రాసెస్ చేసిన మీట్

మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు. ఇది క్యాన్సర్ సమస్యను మరింత పెంచుతుంది. వీటిలో ప్రిజర్వేటివ్స్, అధిక సోడియం వాడతారు. ఇది కడుపు క్యాన్సర్ నుంచి పెద్దప్రేగు క్యాన్సర్‌ వరకు కారణమవుతుంది. కాబట్టి ఏ పరిస్థితులలోను ప్రాసెస్‌ చేసిన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు.

2. బీఫ్‌ తినకూడదు

క్యాన్సర్ సమస్య ఉన్న కుటుంబాలు గొడ్డు మాంసం తినకూడదు. నిజానికి దీనిని తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దీనిపై వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ కూడా గొడ్డు మాంసం తినే వ్యక్తులను హెచ్చరించింది. వారంలో 500 గ్రాములు మాత్రమే తినాలని సూచించింది. ఇంతకంటే ఎక్కువ తినడం మంచిది కాదని గుర్తుంచుకోండి.

3. ఉప్పు

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ మాత్రమే కాకుండా క్యాన్సర్ కూడా వస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. సాల్ట్ ఫుడ్ ద్వారా కడుపు క్యాన్సర్ సమస్య ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోకుండా ప్రయత్నించండి. అధిక ఉప్పు ఎప్పుడైనా ఆరోగ్యానికి హానికరం.

4. వేయించిన చేపలు

ఒమేగా 3 చేపలలో ఉన్నప్పటికీ అది బాగా వేయించినట్లయితే దాని లక్షణాలు లోపాలుగా మారుతాయి. ఇది క్యాన్సర్ సమస్యను కలిగిస్తుంది. వాస్తవానికి చేపలను వేయించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది ప్యాంక్రియాటిక్, అండాశయాలు, కాలేయం, రొమ్ము కొలొరెక్టల్, అన్నవాహిక క్యాన్సర్లకి కారణమవుతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. ఈ 5 ఆహారాలని డైట్‌లో చేర్చండి..!

Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?

IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు