Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?

Health Tips: భారతదేశంలో చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. నేటి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఇది ఏర్పడుతుంది.

Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?
Acidity Symptoms
Follow us
uppula Raju

|

Updated on: May 06, 2022 | 12:51 PM

Health Tips: భారతదేశంలో చాలా మంది ఎసిడిటీ, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. నేటి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఇది ఏర్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యాన్ని పాడుచేసే కొన్ని అలవాట్లని మార్చుకోవాలి. ముఖ్యంగా ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్ల వల్ల అసిడిటీ సమస్య తలెత్తుతుంది. అందులో మొదటగా టీ గురించి చెప్పుకోవాలి. మీరు టీని ఇష్టపడి ఉదయం పరగడుపున తాగితే ఎసిడిటీ, రిఫ్లక్స్ సమస్య తలెత్తుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే పిత్త రసంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఆమ్లత్వం, వికారం సమస్యలు ఏర్పడుతాయి. టీ మాత్రమే కాదు పరగడుపున తినకూడని చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిలో మసాలా వస్తువులు, వేడి కాఫీ, అధిక నూనె ఆహారం, చాక్లెట్ మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

పొద్దున్నే టీ లేకుండా ఉండలేకపోతే అందులో కొంచెం అల్లం కలుపుకుని తాగవచ్చు. దీంతో ఎసిడిటీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ను చేర్చండి. ఇది కడుపులో గ్యాస్‌ను కలిగించదు. జీర్ణవ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్లు తింటే పొట్ట సమస్యలు రావు. పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి మీరు వీటిని ప్రతిరోజూ ఉదయం తినవచ్చు. అయితే ఎసిడిటీని నివారించడానికి ఎక్కువగా నూనెలో ఉడికించకూడదు. తిన్న తర్వాత కొంచెం దూరం నడిస్తే మంచిది. ఇది ఎసిడిటీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి. యోగ, ధ్యానం కూడా మంచిదే.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!

International No Diet‌ Day 2022: ఈ రోజు అంతర్జాతీయ నో డైట్‌ డే.. ఇష్టమైన ఆహారం ఏదైనా తినవచ్చు.. కానీ ఒక షరతు..!

IPL 2022: తల్లి ఇళ్లల్లో బట్టలు ఉతికి కష్టపడి పెంచింది.. ఇప్పుడు కొడుకు గొప్ప క్రికెటర్..!