Health Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. ఈ 5 ఆహారాలని డైట్‌లో చేర్చండి..!

Health Tips: ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు చిన్న వయసులోనే వస్తున్నాయి. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు

Health Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. ఈ 5 ఆహారాలని డైట్‌లో చేర్చండి..!
Knee Pain
Follow us

|

Updated on: May 06, 2022 | 1:05 PM

Health Tips: ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు చిన్న వయసులోనే వస్తున్నాయి. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే వస్తున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్ల వల్ల ఏర్పడుతున్నాయి. సాధారణంగా గాయాలు, ప్రమాదాల వల్ల మోకాళ్లలో నొప్పి రావడం సహజం. కానీ కొన్నిసార్లు ఆహారంలో పోషకాల కొరత వల్ల కూడా ఈ సమస్య ఎదుర్కొంటారు. అందుకే రోజువారీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. మీ శరీరంలో కాల్షియం లేదా ప్రోటీన్ లేకుంటే మోకాలి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నొప్పి కారణంగా వాపు కూడా మొదలవుతుంది. ఈ పరిస్థితిలో మీరు ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ క్యాబేజీ, బ్రోకలీ వంటి ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో మంటను కలిగించే ఎంజైమ్‌లు తగ్గడం ప్రారంభిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోండి. తద్వారా ఎముకలు దృఢంగా ఉంటాయి. మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి.

2. నట్స్‌

నట్స్‌లో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు తరచుగా తినమని సూచిస్తారు. ఇవి ఎముకలను బలపరుస్తాయి. అందుకే నట్స్ తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

3. అల్లం, పసుపు

అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందుకే ఈ మసాలా దినుసులు శతాబ్దాలుగా ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా ఈ రెండు దినుసులని డైట్ లో చేర్చుకుంటే మంచిది. అల్లం, పసుపు కలిపి కషాయం చేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

4. పండ్లు

కొన్ని పండ్లు తినడం వల్ల మోకాళ్ల నొప్పులు నయమవుతాయి. వీటిలో నారింజ, స్ట్రాబెర్రీ, చెర్రీస్ ఉంటాయి. వీటిలో విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల వాపును తగ్గిస్తాయి.

5. పాలు

విటమిన్ డి, కాల్షియం పాలు, అన్ని పాల ఉత్పత్తులలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల పటిష్టతకు మేలు చేస్తాయి. పాలలో ఎక్కువ కొవ్వు ఉండకూడదని గుర్తుంచుకోండి. లేకపోతే బరువు పెరుగుతారు. ప్రతిరోజు ఒక గ్లాసు పాలు ఉదయం, సాయంత్రం తీసుకుటే ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?

IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!

International No Diet‌ Day 2022: ఈ రోజు అంతర్జాతీయ నో డైట్‌ డే.. ఇష్టమైన ఆహారం ఏదైనా తినవచ్చు.. కానీ ఒక షరతు..!

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..