IPL 2022 Purple Cap: చాహల్, కుల్దీప్ మధ్య ఒక వికెట్ మాత్రమే తేడా.. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!
IPL 2022 Purple Cap: ఐపీఎల్ 2022లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల
IPL 2022 Purple Cap: ఐపీఎల్ 2022లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన బంతులు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌పై చాలా ప్రభావం చూపాయి. ఈ ప్రభావమే జట్టు విజయానికి కారణమైంది. కానీ ఈ ప్రభావం పర్పుల్ క్యాప్‌లో ఏ విధమైన మార్పు చూపించలేదు. యుజ్వేంద్ర చాహల్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ అదే సంఖ్యలో 18 వికెట్లు సాధించాడు. అంటే చాహల్, కుల్దీప్ మధ్య కేవలం ఒక వికెట్ గ్యాప్ ఉంది. చాహల్ నంబర్ వన్ కాగా, కుల్దీప్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీశాడు. అయినప్పటికీ అతను పర్పుల్ క్యాప్ రేసులో వెనుకబడే ఉన్నాడు. ఖలీల్ ప్రస్తుతం టాప్ 5లో కూడా లేడు.
IPL 2022 పర్పుల్ క్యాప్ రేసులో చాహల్, కుల్దీప్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్లయితే టాప్ 5లో మిగిలిన 3 బౌలర్లు ఎవరు అని అందరు ఆలోచిస్తున్నారు కదూ.. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెందిన కగిసో రబడ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అతను ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన టి.నటరాజన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ ఆడలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. బెంగళూరు ఆటగాడు వనిందు హసరంగ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి