AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత వేగవంతమైన బంతి.. దెబ్బకు రికార్డులు కుదేల్.. బ్రేకుల్లేని బుల్డోజర్ ఈ బౌలర్..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ భయాందోళనలు సృష్టించాడు. ఈ బౌలర్ స్పీడ్ గంటకు 157 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. ఇది ఏ భారతీయ ఆటగాడికైనా అత్యంత వేగవంతమైన బంతిగా నిలిచింది.

IPL 2022: ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత వేగవంతమైన బంతి.. దెబ్బకు రికార్డులు కుదేల్.. బ్రేకుల్లేని బుల్డోజర్ ఈ బౌలర్..
Umran Malik
Venkata Chari
|

Updated on: May 06, 2022 | 4:08 PM

Share

క్రికెట్‌ను బ్యాట్స్‌మెన్ గేమ్‌గా పరిగణిస్తారి తెలిసిందే. అయితే కొన్నిసార్లు బౌలర్లకు కూడా ఈ గేమ్‌లో తమ ప్రత్యేకతను చాటుకుంటారనడంలో సందేహం లేదు. ఇలాంటి వారిలో ఫాస్ట్ బౌలర్లు కూడా ఉంటారు. షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, షాన్ టైట్ వంటి వారి స్పీడ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల వేగానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు. అయితే, తాజాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik) తనదైన వేగంతో ‘ నిప్పులు’ చెరగడంతో.. అభిమానులు కూడా అలాంటి థ్రిల్‌ను అనుభవిస్తున్నారు. ఉమ్రాన్ నిరంతరం 150 కి.మీ.పైగా వేగంలో బంతులు విసరడంతో ఐపీఎల్ స్పీడ్ స్టర్‌గా మారిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ భయాందోళనలు సృష్టించాడు. ఉమ్రాన్ మాలిక్ స్పీడ్(Umran Malik Speed)157 కి.మీ. గంట వేగంతో బంతిని విసిరాడు. ఇది ఏ భారతీయ ఆటగాడికైనా అత్యంత వేగవంతమైన బంతిగా నిలిచింది.

ప్రస్తుతం ప్రశ్న ఏమిటంటే, ఉమ్రాన్ మాలిక్ ఇంత వేగంగా బంతిని ఎలా విసిరాడు? అన్నింటికంటే, మ్యాచ్‌లవారీగా వేగం ఎలా పెరుగుతోంది? ఉమ్రాన్ మాత్రమే కాదు, కార్తీక్ త్యాగి కూడా 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంత వేగంగా బంతిని విసరడానికి గత ఐదు కారణాలను ఇప్పుడు చూద్దాం.

ఉమ్రాన్ మాలిక్ రన్ అప్ పర్ఫెక్ట్..

ఉమ్రాన్ మాలిక్ వేగంగా డెలివరీ చేయడానికి పెద్ద కారణం అతని రన్-అప్. ఉమ్రాన్ మాలిక్ రన్-అప్ చాలా పొడవుగా ఉంటుంది. ఈ సమయంలో అతని తల చాలా స్థిరంగా ఉంటుంది. అలాగే, అతను బంతిని విసిరినప్పుడు, అతని ఫాలో త్రూ కూడా అద్భుతంగా ఉంటుంది. రన్ అప్‌లో ఉమ్రాన్ మాలిక్ స్ప్రింటర్‌లా పరుగెత్తడం కనిపించింది. ఇది బంతి వేగాన్ని పెంచడానికి మరింత సహాయపడుతుంది.

మొత్తం శరీరం కూడా..

సాధారణంగా బంతి వేగాన్ని చేతులే నిర్ణయిస్తాయని అనుకుంటారు. కానీ అలా కాదు. బంతి వేగం మొత్తం శరీరానికి ఉన్న బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇందులో కాళ్లు, అబ్స్, గ్లూట్స్ కండరాలు చాలా దోహదపడతాయి. అలాగే నాన్ బౌలింగ్ చేయి (మరోవైపు) కూడా బంతి వేగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి బంతికి తన మొత్తం శరీర బలాన్ని ఉపయోగించే ఆటగాడు మాత్రమే వేగంగా బౌలింగ్ చేయగలడు. ఉమ్రాన్ మాలిక్ ఈ పనిని ఉత్తమ మార్గంలో చేస్తున్నాడు. ఇదే సమయంలో బంతి వేగాన్ని మరింత పెంచే అవకాశం కూడా ఉమ్రాన్‌కు ఉందనడంలో సందేహం లేదు.

ఫాస్టెస్ట్ బంతులకు మంచి ఫిట్‌నెస్ అవసరం..

ఉమ్రాన్ మాలిక్‌లోని గొప్పదనం ఏమిటంటే అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతని కాళ్లు చాలా బలంగా ఉన్నాయి. ఉమ్రాన్ ఎప్పుడూ ఇసుకలో క్రికెట్ ఆడేవాడని మాలిక్ కోచ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దాని కారణంగా అతని కాళ్ళు చాలా బలంగా మారాయి. దాని కారణంగా అతను ఇతర ఫాస్ట్ బౌలర్ల కంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని ఫిట్‌నెస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

అంతులేని ప్రతిభ..

ప్రతి బౌలర్‌కు తన స్వంత పరిమితి ఉంటుంది. ఆ మేరకు మాతరమే వారు తమ వేగాన్ని పెంచుకోగలరన్నది నిజం. కొంతమంది బౌలర్లు ఈ నైపుణ్యాన్ని సహజంగానే కలిగి ఉంటారు. కాబట్టి వేగం పరంగా ఇతరుల కంటే ముందుంటారు. అలాంటి బౌలర్లలో ఉమ్రాన్ కూడా ఒకడు. ఈ ఆటగాడు జిమ్‌లో చెమటోడ్చుతుంటాడు. మైదానంలో తీవ్రంగా శిక్షణ పొందుతున్నాడు. అతని స్పీడ్‌ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోవడానికి ఇదే కారణంగా నిలిచింది.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!

IPL 2022: తల్లి ఇళ్లల్లో బట్టలు ఉతికి కష్టపడి పెంచింది.. ఇప్పుడు కొడుకు గొప్ప క్రికెటర్..!