AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదేం షాట్ మావా.. ఇలాక్కూడా కొడతారా.. వార్నర్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాంకే.. వైరల్ వీడియో..

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ IPL 2022లో అత్యంత అద్భుతమైన షాట్ ఆడాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

Watch Video: ఇదేం షాట్ మావా.. ఇలాక్కూడా కొడతారా.. వార్నర్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాంకే.. వైరల్ వీడియో..
Ipl 2022 David Warner Most Incredible Shot
Venkata Chari
|

Updated on: May 06, 2022 | 5:28 PM

Share

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) తన మాజీ IPL జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై తుపాన్ ఇన్నింగ్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ అవకాశం వచ్చినా.. మరో ఎండ్‌లోని బ్యాటర్‌కు సూచనలిస్తూ ఎంకరేజ్ చేస్తూ బ్యాటింగ్ చేయండంలోనూ కీలక పాత్ర పోషించాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ ఓనర్ కావ్యా పాపను కూడా నెటిజన్లు ఆడేసుకున్నారు. డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్‌లో గెలిచి, ప్లే ఆఫ్ అవకాశాలను అలాగే ఉంచుకుంది. డేవిడ్ వార్నర్ కేవలం 58 బంతుల్లో అజేయంగా 92 పరుగులు చేసి, ఆకట్టుకున్నాడు.

స్టేడియంలోని ప్రతి మూలకు బంతిని కొడుతూ, హైదరాబాద్ బౌలర్లను చీల్చి చెండాడాడు. కాగా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆడిన ఓ ఢిపరెంట్ షాట్‌ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ అసాధారణ షాట్‌ను చూసి వ్యాఖ్యాతలతోపాటు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్ మొదటి బంతికి స్విచ్ హిట్ కొట్టాలని వార్నర్ నిర్ణయించుకున్నాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ వార్నర్‌ను గమనించి, అతని కాళ్లపై తెలివిగా బౌల్ చేశాడు. దీంతో వార్నర్‌కు షాట్ ఆడేందుకు ఆస్కారం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

కానీ, ఈ మాజీ SRH కెప్టెన్ కుడిచేతి వాటంగా తన స్టైల్‌ను మార్చుకుని, బాటమ్ హ్యాండ్ గ్రిప్‌ను ఉపయోగించి బంతిని ఫైన్-లెగ్ బౌండరీకి తరలించాడు. దీంతో షాకైన ప్రత్యర్థి ఆటగాళ్లు.. ఇదేం షాట్ రా అయ్యా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ షాట్‌కు ఖచ్చితంగా ఓ పేరు పెట్టాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

“ఇది చాలా తెలివైన షాట్. ఎందుకంటే వార్నర్ ఏదో నిర్ణయించుకున్నాడు. ఊహించని షాకిచ్చిన బౌలర్‌కు.. ఆ సమయంలో ఇలాంటి షాట్ కొట్టి ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇది టిక్‌టాక్‌లో వేసే డ్యాన్స్‌లా ఉంది’ అని హర్షా భోగ్లే వ్యాఖ్యానం సందర్భంగా పేర్కొన్నారు.

“వార్నర్ స్కూప్ ఆడాలని చూశాడు. వాస్తవానికి స్విచ్ తగిలింది. ఎందుకంటే అతని ఎడమ చేయి.. ఆ సమయంలో కుడి చేతిగా మారింది. ఎంతో అందమైన, చాలా గొప్ప షాట్” అని సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో రోవ్‌మాన్ పావెల్ (35 బంతుల్లో 67) కూడా అద్భుత ఆటతీరుతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ఐపీఎల్‌ హిస్టరీలో అత్యంత వేగవంతమైన బంతి.. దెబ్బకు రికార్డులు కుదేల్.. బ్రేకుల్లేని బుల్డోజర్ ఈ బౌలర్..

IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!