AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Orange Cap: బట్లర్‌, రాహుల్‌కి పొంచి ఉన్న ముప్పు.. డేవిడ్‌ వార్నర్‌ రేసులోకి వచ్చేశాడుగా..!

IPL 2022 Orange Cap: ఆరెంజ్ క్యాప్ ఎవరి తలపై ఉంటుదనేది మే 29న తేలుతుంది. కానీ పోటీలో ఇప్పుడు పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. జోస్ బట్లర్,

IPL 2022 Orange Cap: బట్లర్‌, రాహుల్‌కి పొంచి ఉన్న ముప్పు.. డేవిడ్‌ వార్నర్‌ రేసులోకి వచ్చేశాడుగా..!
Orange Cap Race
uppula Raju
|

Updated on: May 06, 2022 | 9:32 AM

Share

IPL 2022 Orange Cap: ఆరెంజ్ క్యాప్ ఎవరి తలపై ఉంటుదనేది మే 29న తేలుతుంది. కానీ పోటీలో ఇప్పుడు పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. జోస్ బట్లర్, KL రాహుల్‌ స్థానాలకి ముప్పు పొంచి ఉంది. తాజాగా ఆరెంజ్ క్యాప్ రేసులో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. జోస్ బట్లర్, KL రాహుల్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయితే శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, అభిషేక్ శర్మ ఎడమ చేతి బ్యాట్స్‌మెన్స్‌. ఈ ముగ్గురు ఆటగాళ్లతో ఇప్పుడు బట్లర్‌, రాహుల్‌కి గట్టి పోటీ ఉంటుంది. మరోవైపు డేవిడ్‌ వార్నర్‌ సడెన్‌గా రేసులోకి దూసుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 58 బంతుల్లో 92 పరుగులు చేసిన వార్నర్ నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. IPL 2022లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 60 సగటుతో 356 పరుగులు చేశాడు. 156 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు.

ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో జోస్ బట్లర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 65కి పైగా సగటుతో 588 పరుగులు చేశాడు. మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 56కి పైగా సగటుతో 451 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్, అభిషేక్ శర్మ మిగిలిన రెండు స్థానాల్లో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచుల్లో 359 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 331 పరుగులు చేశాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

NEET UG 2022 పరీక్ష వాయిదా పడుతుందా.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటో తెలుసుకోండి..!

Hair Care: 20 ఏళ్లకే జుట్టు తెల్లబడుతుందా.. మీరు ఈ లోపం గురించి తెలుసుకోవాల్సిందే..!

Sabja Seeds: సబ్జా గింజలు తినడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..?