IPL 2022: ఢిల్లీ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరుకుంటుందా.. లెక్కలు ఏ విధంగా ఉన్నాయంటే..?

IPL 2022:IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రయాణం హెచ్చు తగ్గులతో కూడి ఉంది. గత మూడు సీజన్లలో వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఈ జట్టు ఈ సీజన్‌లో

IPL 2022: ఢిల్లీ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరుకుంటుందా.. లెక్కలు ఏ విధంగా ఉన్నాయంటే..?
Delhi Play Offs
Follow us

|

Updated on: May 06, 2022 | 8:20 AM

IPL 2022:IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రయాణం హెచ్చు తగ్గులతో కూడి ఉంది. గత మూడు సీజన్లలో వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఈ జట్టు ఈ సీజన్‌లో మాత్రం పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవడం లేదు. జట్టుకు ఇంతకు ముందున్న బలం లేదనేది కొంత వరకు నిజమేనని చెప్పవచ్చు. అయినప్పటికీ రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి 10 పాయింట్లతో రేసులో నిలిచింది. ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం ద్వారా ప్లే ఆఫ్‌కి అర్హత సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ 16, లక్నో సూపర్‌ గెయింట్స్‌ 14, రాజస్తాన్‌ రాయల్స్‌ 12, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూర్ 12 పాయింట్లతో ముందు వరుసలో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, పంజాబ్‌ కింగ్స్‌ 10 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇందులో ఏది ప్లే ఆఫ్‌కి చేరుకుంటుందో చెప్పడం కొంచెం కష్టమే. మిగిలిన మ్యాచ్‌లు పూర్తయితే కానీ ఏ సంగతి తెలియదు. మరొక విషయం ఏంటంటే రన్‌ రేట్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది.

ఢిల్లీ.. ముంబై ఇండియన్స్‌ను ఓడించడం ద్వారా ఈ సీజన్‌ను ప్రారంభించింది. కానీ ఇప్పటివరకు వరుసగా రెండు మ్యాచ్‌లను గెలవలేకపోయింది. అందులో ఒకటి విభిన్న మైదానాలు అని చెబుతున్నారు. IPL 2022 సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముంబైలోని 4 గ్రౌండ్‌లు, పూణే, ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ ఒక మైదానంలో మాత్రమే విజయం సాధిస్తుంది. మే 5న జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని చారిత్రాత్మక బ్రబౌర్న్ స్టేడియంలో జట్టు ఈ విజయాన్ని అందుకుంది. నిజానికి బ్రబౌర్న్ స్టేడియం ఢిల్లీకి అదృష్టంగా మారింది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ జట్టు గెలిచింది. ఈ మైదానంలో హైదరాబాద్‌తో పాటు ముంబై, పంజాబ్, కోల్‌కతా జట్లను ఓడించింది. అదృష్టం ఏంటంటే.. ఢిల్లీకి ఇప్పుడు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా ఈ మైదానంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగడం లేదు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: కసి తీర్చుకున్న డేవిడ్‌ వార్నర్.. హైదరాబాద్‌ని వీర బాదుడు బాదేశాడుగా..!

Sabja Seeds: సబ్జా గింజలు తినడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..?

IPL 2022 Purple Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ బౌలర్.. చాహల్‌కి కేవలం 3 వికెట్ల దూరంలో..!

Latest Articles
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??