AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: కసి తీర్చుకున్న డేవిడ్‌ వార్నర్.. హైదరాబాద్‌ని వీర బాదుడు బాదేశాడుగా..!

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2022: కసి తీర్చుకున్న డేవిడ్‌ వార్నర్.. హైదరాబాద్‌ని వీర బాదుడు బాదేశాడుగా..!
David Warner
uppula Raju
| Edited By: |

Updated on: May 06, 2022 | 4:53 PM

Share

IPL 2022: ఐపీఎల్‌ 2022లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి సన్‌రైజర్స్‌ మాజీ ఆటగాడు ప్రస్తుత ఢిల్లీ ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌పైనే ఉంది. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో వార్నర్ ఐపీఎల్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాడని చెప్పవచ్చు. 2016లో తన కెప్టెన్సీలో హైదరాబాద్‌ని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన వార్నర్ ఈ ఫ్రాంచైజీకి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ గత సీజన్‌లో జట్టు విఫలమవడంతో కెప్టెన్సీ నుంచి తొలగించారు.  ఆ తర్వాత ఫ్రాంచైజీకి, వార్నర్‌కు మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరిగింది. అనంతరం మెగా ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ డేవిడ్ వార్నర్‌ను దక్కించుకుంది. అయితే నిన్నటి మ్యాచ్‌లో అతడి ఆటతీరు తనకి జరిగిన అవమానానికి కసి తీర్చుకున్నట్లుగా కనిపించిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

బ్రబౌర్న్ స్టేడియంలో SRHపై వార్నర్ కేవలం 54 బంతుల్లో అజేయంగా 92 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్ దాదాపు ప్రతి సీజన్‌లో 500 నుంచి 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. వార్నర్ 2014 నుంచి 2020 వరకు ప్రతి సీజన్‌లో వరుసగా 500కు పైగా పరుగులు చేశాడు. 2021లో మాత్రమే 195 పరుగులు చేశాడు. కానీ ఇప్పుడు మళ్లీ అదే ఫామ్ వార్నర్‌లో కనిపిస్తుంది. ఈ దిగ్గజ ఓపెనర్ ఇప్పటివరకు కేవలం 8 ఇన్నింగ్స్‌లలో 4 అర్ధ సెంచరీలతో సహా 356 పరుగులు చేశాడు. దాదాపు 157 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మళ్లీ 500కి పైగా పరుగులు చేయడం ఖాయం అనిపిస్తోంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sabja Seeds: సబ్జా గింజలు తినడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..?

IPL 2022 Purple Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ బౌలర్.. చాహల్‌కి కేవలం 3 వికెట్ల దూరంలో..!

IPL 2022 Orange Cap: ఆర్సీబీ గెలిచినా టాప్‌ 5లో చోటు సంపాదించని డుప్లెసిస్.. నెంబర్‌ వన్‌గా బట్లర్‌కి తిరుగులేదు..!

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్