DC vs SRH Live Score: దంచికొట్టిన వార్నర్.. దుమ్ములేపిన పావెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్..
DC vs SRH Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. గతేడాది తనను జట్టు నుంచి తప్పించి, ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు ఆ జట్టుపై కసిగా ఆడాడు.
DC vs SRH Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. గతేడాది తనను జట్టు నుంచి తప్పించి, ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించినందుకు ఆ జట్టుపై కసిగా ఆడాడు. గురువారం హైదరాబాద్‌పై ధాటిగా ఆడిన అతను కేవలం 58 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. అతనికి తోడు రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 67, 3ఫోర్లు, 5 సిక్స్) మెరుపు ఇన్సింగ్స్ ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లోలాగానే ఈ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. భువనేశ్వర్ (25/1) మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ తురుపుముక్కగా భావిస్తోన్న ఉమ్రాన్ మాలిక్ (52/4) పూర్తిగా నిరాశపరిచాడు.
కాగా అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మొదటి ఓవర్లోనే షాకిచ్చాడు భువనేశ్వర్. మన్‌దీప్ సింగ్ (0)ను ఔట్‌చేసి తన జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత మిషెల్ మార్ష్ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 26) కొన్ని మెరుపులు మెరిపించాడు. అయితేఎప్పుడైతే పావెల క్రీజులోకి వచ్చాడో ఢిల్లీ స్కోరు పరుగులందుకుంది. వీరిద్దరూ కేవలం 63 బంతుల్లోనే 123 పరుగులు జోడించడం విశేషం. మరి 208 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ అందుకుంటుందో లేదో తెలుసుకోవాలంటే https://tv9telugu.com/ అందించే లైవ్ అప్డేట్స్‌ను చూడండి.