Jai Bhim: ముదురుతున్న జై భీమ్ వివాదం.. హీరో సూర్యకు షాక్ ఇచ్చిన కోర్టు..
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్(Jai Bhim) సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓటీటీవేదికగా విడుదలైన ఈ సినిమా సూర్య అభిమానులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్(Jai Bhim) సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓటీటీవేదికగా విడుదలైన ఈ సినిమా సూర్య అభిమానులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కదిలించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రు కథే ‘జై భీమ్’. ఈ సినిమాలో చంద్రు పాత్రలో హీరో సూర్య నటించారు. నటుడిగానే కాదు నిర్మాతగానూ ఆయన న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘జై భీమ్’ సినిమాను రూపొందించారు. పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ సాగే కథ ఇది. సామాజిక అసమానతలు, ఒక వర్గాన్ని మరో వర్గం తక్కువగా చూడటం అనేది మన దేశంలో కొత్తేమీ కాదు. అనాదిగా జరుగుతున్న విషయమే. అయితే కాలక్రమేణ ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. ఇదే అంశంతో.. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా జై భీమ్. అయితే ఈ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
తాజాగా హీరో సూర్యకి షాక్ కోర్ట్ ఇచ్చింది. సూర్య ఆయన సతీమణి జ్యోతిక ఫై కేసు నమోదు చేయాలనీ సైదాపేట కోర్ట్ ఉత్తర్వులు జరీ చేసింది న్యాయస్థానం. జై భీమ్ సినిమా కులాన్ని, మతాన్ని కించపరుస్తుందని కోర్ట్ ని ఆశ్రయించారు రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్. సినీ నిర్మాతలు, హీరో సూర్య, నటి జ్యోతికపై సంతోష్ నాయక్ సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ వెంటనే ఇరువురి ఫై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. దీని పై అటు నిర్మాతలు కానీ.. ఇటు సూర్య, జోతిక కానీ స్పందించలేదు.