Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ’12ఏళ్ల వయసులోనే నా హృదయం ముక్కలైంది’.. ఆసక్తికర విషయం చెప్పిన పూజా..

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న బుట్టబొమ్మ ఆ వుడ్ ఈ వుడ్ అని అలేకుండా అన్నింటిలోనూ సత్తాచాటుతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు పూజ హెగ్డే ఫిస్ట్ ఛాయిస్ అవుతుంది.

Pooja Hegde: '12ఏళ్ల వయసులోనే నా హృదయం ముక్కలైంది'.. ఆసక్తికర విషయం చెప్పిన పూజా..
Poojahegde
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2022 | 4:10 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న బుట్టబొమ్మ(Pooja Hegde)ఆ వుడ్ ఈ వుడ్ అని అలేకుండా అన్నింటిలోనూ సత్తాచాటుతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు పూజ హెగ్డే ఫిస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, దళపతి విజయ్ తో కలిసి బీస్ట్.. వెరీ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ కు జోడీగా ఆచార్య సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈ మూడు సినిమాల రిజల్స్ ఎలా ఉన్నా ఆ ప్రభావం మాత్రం పూజామీద పెద్దగా పడలేదనే చెప్పాలి. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. పన్నెండేళ్ల వయసులోనే హృదయం ముక్కలయ్యిందని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. ఇంతకు పూజ గుండెకు గాయం  తెలుసా..?

అందాల భామ పూజాహెగ్డేకు బాలీవుడ్ స్టర్ హీరో హృతిక్ రోషన్ అంటే చెప్పలేని అభిమానం అంట.. చిన్నతనం నుంచి హృతిక్ అంటే పిచ్చి అభిమానం ఉన్న పూజ ఆయనను ఎలాగైనా ఒక్కసారైనా కలవాలని అనుకుందట. అయితే ఆ అవకాశం ఒక్కసారి వచ్చిందట. కోయీ మిల్ గయా సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆ మూవీ ప్రీమియర్ జరిగింది. ఎలాగోలా ఆ ప్రీమియర్ కు వెళ్ళాను. ఆయనతో ఎలాగైనా ఫోటో దిగాలని భావించాను. అంతా ఫోటోలు దిగుతున్న సమయంలో నేను కూడా ఫోటో దిగేందుకు స్టేజ్ పైకి ఎక్కాను. కానీ హృతిక్ అప్పుడే స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. దాంతో నా హృదయం ముక్కయైనంత పనైంది. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు అంటూ చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ అయిన తర్వాత పూజ హృతిక్ తో కలిసి మొహంజొదారో అనే భారీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Trisha Birthday: 2 దశాబ్ధాలుగా వెండితెరను ఏలుతున్న రాజసం ఆమెది.. చెన్నై చంద్రం త్రిష బర్త్ డే స్పెషల్

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..