Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt).. తన లగేజీ ట్రాలీతో ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో పరుగులు పెట్టింది. ఆకస్మాత్తుగా అలియాను అక్కడ చూడగానే సిబ్బందితోపాటు.

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..
Alia
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2022 | 1:25 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt).. తన లగేజీ ట్రాలీతో ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో పరుగులు పెట్టింది. ఆకస్మాత్తుగా అలియాను అక్కడ చూడగానే సిబ్బందితోపాటు.. ప్రయాణికులు సైతం ఆశ్చర్యపోయారు… లగేజీ ట్రాలీతో ఎందుకు అలా పరుగులు పెట్టిందని చూడగా.. మరికొందరు మాత్రం వెంటనే తమ ఫోన్లలో వీడియోస్ తీయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అలియా అలా పరిగెత్తడం కేవలం షూటింగ్‎లో భాగమనే అర్థమవుతుంది. ప్రస్తుతం అలియా .. డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమా చేస్తుంది.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలోని ఇందీరా గాంధీ ఎయిర్ పోర్టులో నిర్వహించారు.

ఈ క్రమంలోనే అలియా తన లగేజీ ట్రాలీ పట్టుకోని పరుగెత్తింది.. ఆమె ఎదురుగానే డైరెక్టర్ కరణ్ జోహార్.. చిత్రయూనిట్ సభ్యులు సైతం ఉన్నారు. అయితే కరణ్ జోహర్ నలుపు రంగు దుస్తులు ధరించడంతో ప్రయాణికులు అతడిని గుర్తించలేదు.. వివాహం తర్వాత అలియా ఆకస్మాత్తుగా ఎయిర్ పోర్టులో పరిగెత్తడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత ఆ సన్నివేశం పూర్తిగా సినిమాలో ఓ భాగం మాత్రమే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే.. అలియా ఈ సినిమా షూటింగ్ లో పాల్గోంటుంది. ఇందులో రణవీర్ సింగ్, జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Liger: అప్పుడే మొదలైన రౌడీ దండయాత్ర.. భారీ ధరకు లైగర్ డిజిటల్ ఆడియో రైట్స్..

Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..

Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..