AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

సమసిపోయిందనుకున్న వివాదాన్ని మరోసారి తట్టి లేపారు నటి సుహాసిని. హిందీ భాష పేరు చెబితేనే మండిపడే తమిళనాడులో హిందీకి మద్దతు తెలిపారు.

Suhasini: భాష వివాదంపై స్పందించిన నటి సుహాసిని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
Suhasini
Rajitha Chanti
|

Updated on: May 04, 2022 | 8:47 AM

Share

సమసిపోయిందనుకున్న వివాదాన్ని మరోసారి తట్టి లేపారు నటి సుహాసిని. హిందీ భాష పేరు చెబితేనే మండిపడే తమిళనాడులో హిందీకి మద్దతు తెలిపారు. దీంతో భాషల వివాదం మరోసారి భగ్గుమంటోంది. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య.. సినీ నటీనటుల మధ్య వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ భాషపై దక్షిణాది రాష్ట్రాలు.. హిందీ సినిమాలపై సౌత్‌ ఇండియా సినీస్టార్స్‌ .. ఇలా కొత్త వివాదాలు పురుడు పోసుకుంటున్నాయి. ఇటీవల బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌, కన్నడ నటుడు సుదీప్‌ మధ్య హిందీ వివాదం హీట్‌ పెంచింది. హిందీ జాతీయ భాష కాదని సుదీప్‌ కామెంట్‌ చేస్తే.. మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్‌ చేస్తున్నారని అజయ్‌ దేవ్‌గన్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇలాంటి సమయంలో మరోసారి భాషల మధ్య దుమారాన్ని మరింత రాజేసేందుకు నటి సుహాసిని (Suhasini) కామెంట్లు దోహదం చేస్తున్నాయి.

చెన్నైలో జరిగిన ఓ షాప్‌ ఓపెనింగ్‌కి ముఖ్య అతిధిగా హాజరైన నటి సుహాసిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హిందీ భాష మాట్లాడేవాళ్లు కూడా మంచి వాళ్లేనని, వాళ్లతో మాట్లాడాలంటే మనం కూడా హిందీ నేర్చుకోవాలని కామెంట్‌ చేశారు సుహాసిని. ఈ కామెంట్లపై ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. హిందీ మంచి లాంగ్వేజ్‌.. హిందీ మాట్లాడే వాళ్లు మంచి వాళ్లు.. ఖచ్చితంగా మనం కూడా ఆ భాష నేర్చుకోవాలి. తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లే.. హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషం అంటూ చెప్పుకొచ్చింది. అయితే సుహాసిని వ్యాఖ్యలపై తమిళనాడులో జనం మండిపడుతున్నారు. హిందీ మీద అంత ఇష్టం ఉంటే ముంబైకి వెళ్లి బాలీవుడ్‌ సినిమాల్లో నటించాలని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ లాంగ్వేజ్‌గా మారిన వివాదం ఇప్పుడు సుహాసిని కామెంట్లతో మళ్లీ ఆజ్యం పోసినట్టయింది. మరి ఈ దుమారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..

F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..