Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నాడు. చేతినిండా సినిమాలతో.. షూటింగ్స్ అంటూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు.

Prabhas-Anushka: మరోసారి హిట్ పెయిర్ రిపీట్.. ప్రభాస్ సరసన అనుష్క ?.. ఏ సినిమాలో అంటే..
Prabhas
Follow us

|

Updated on: May 04, 2022 | 8:31 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నాడు. చేతినిండా సినిమాలతో.. షూటింగ్స్ అంటూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు డార్లింగ్.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో రాబోయే తన సినిమాల విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్స్ లలో పాల్గొంటున్నాడు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయాల్సిన స్పిరిట్ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇవే కాకుండా.. డైరెక్టర్ మారుతి డైరెక్షన్లోనూ ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో రూమర్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో హీరోయిన్‏గా అనుష్క నటించనున్నట్లుగా టాక్. మాస్ మసాలా ఎంటర్టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతోపాటు.. మరో ఇద్దరు హీరోయిన్లుగా ఉండబోతున్నారని.. ఇప్పటికే అద్భుతమైన ఎలిమెంట్స్ సిద్ధం చేశాడని టాక్ నడుస్తోంది. ఇందులో శ్రీలీలా.. తమిళ్ విజయ్ మాస్టర్ ఫేం మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. అనుష్క కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..

F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..